Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ షో నుంచి అందుకే బయటికి వచ్చేశా.. నాగబాబు కామెంట్స్

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:20 IST)
జబర్దస్త్ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఎందుకు వెళ్లిపోయాడనేది చాలామంది చాలా కారణాలు చెప్తున్నారు. అయితే సింపుల్‌గా చెప్పాలంటే.. జీటీవీ డబ్బులెక్కువ ఇస్తున్నారు.. అందుకే ఈ టీవీ నుంచి షిఫ్ట్ అయ్యారని చెప్పేస్తున్నారు సినీ జనం. కానీ వెళ్లిపోయే సమయంలో మాత్రం మల్లెమాలపై చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు నాగబాబు. 
 
జబర్దస్త్ కామెడీ షోను ఓ రకంగా నిందించాడు. అక్కడ పద్దతులను తప్పు పట్టాడు. పైన తెలిసి జరుగుతుందో లేదో తనకు తెలియదు కానీ చాలా తప్పులు జరుగుతున్నాయని విమర్శించాడు నాగబాబు. ఇన్నేళ్లూ డబ్బులు తీసుకుని వెళ్ళే ముందు అలా విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ నాగబాబును అప్పుడు విమర్శించిన వాళ్లు కూడా లేకపోలేదు. 
 
ఇదిలా ఉంటే ఈయన బయటకు వచ్చేయడానికి కారణం ఇప్పుడు ఆయన నోటితోనే చెప్పాడు. జబర్దస్త్ కామెడీ షోను వదిలేసి రెండేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన్ని ప్రశ్నలు మాత్రం వెంటాడటం ఆగలేదు. తాజాగా అభిమానులతో ఛాట్ చేసిన ఈయన్ని మరోసారి ఫ్యాన్స్ ఇదే ప్రశ్నలు అడిగారు. 
 
మీరెందుకు జబర్దస్త్ కామెడీ షోను వదిలేశారు సర్ అని అడిగితే మరో ఆలోచన లేకుండా ఐడియాలిజికల్ డిఫెరెన్స్ అంటూ సమాధానమిచ్చాడు. అంటే కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే బయటికి వచ్చానని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. ఆయన స్థానంలో చాలా మందిని ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మనో ఫిక్సయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments