Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ రష్మిల లవ్ కంటే మా ప్రేమ చాలా గొప్పది.. చెప్పిందెవరు?

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (15:57 IST)
జబర్దస్త్ షోద్వారా సుధీర్ రష్మి ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నారో చెప్పనక్కర్లేదు. ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఈ నేపథ్యంలో ఈ జంట ప్రేమను తక్కువ చేసి మాట్లాడాడు ఓ జబర్దస్త్ కమెడియన్. సుధీర్ రష్మిల లవ్ కంటే కూడా తమ లవ్ చాలా గొప్పదని.. వారు కేవలం ఎనిమిది సంవత్సరాలుగా మాత్రమే ప్రేమించుకుంటున్నారు.. కానీ తమ లవ్ స్టోరి దానికంటే పెద్దదని అంటున్నాడు రైజింగ్ రాజు. 
 
జబర్దస్త్‌ షోకు సంబంధించి ఏ వారానికి ఆవారానికి ఓ ప్రోమోను ఈటీవీ తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా జబర్దస్త్ కు సంబందించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మొదట హైపర్ ఆది స్కిట్‌కు చెందిన సన్నివేశం రాగా.. హైపర్ ఆది ఎప్పటిలాగే తన పంచులతో రైజింగ్ రాజును ఆడేసుకున్నాడు. మన ప్రేమ రష్మి సుధీర్‌లకంటే కూడా గొప్పదని.. మనది ఎనిమిది సంవత్సరాలకు పైబడిన ప్రేమ అని.. ఈ విషయంలో రష్మి సుధీర్‌లు పనికిరారని అంటాడు రైజింగ్ రాజు. దీంతో హైపర్ ఆది కలిగించుకుని అవును మీప్రేమ గుడ్డిదికాదు.. ముసలిప్రేమ అంటూ పంచువిసురుతాడు. ఇక్కడ రోజా కూడా ఓ అదిరిపోయే పంచు విసిరింది.
 
ఇక ఆ తర్వాత వచ్చిన దొరబాబు స్కిట్‌లో భాగంగా ఎక్కువ చేస్తే జైళ్లో వేస్తాం.. అంటూ పోలీసులు అనగానే జైలు నాకు కొత్తేంకాదు అంటూ ముందుకు వస్తాడు దొరబాబు. దీంతో అందురూ నవ్వులు చిందించారు. ఇక్కడ రోజా కూడా ఓ పంచు విసిరింది. అనసూయతో పాటు అందరూ కేవ్వుమన్నారు. ప్రస్తుతం ఈ తాజా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments