Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

ఠాగూర్
శుక్రవారం, 24 జనవరి 2025 (08:31 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు ప్రముఖ సినీ నిర్మాతల గృహాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా చేపట్టిన తనిఖీలు శుక్రవారంతో ముగిశాయి. హైదరాబాద్ నగరంలో మొత్తం 16 చోట్ల 55 అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లతో పాటు.. సినీ దర్శక నిర్మాత సుకుమార్, పలువురు సినీ ఫైనాన్షియర్ల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. 
 
సినీ నిర్మాతలకు భారీ మొత్తంలో డబ్బులు సమకూర్చే ఫైనాన్షియర్లు సత్య రంగయ్య, నెక్కింటి శ్రీధర్‌, నెల్లూరు ప్రతాప్‌ రెడ్డి గృహాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాలే టార్గెట్‌గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతోపాటు 'పుష్ప 2' సినిమా కలెక్షన్స్ వ్యవహారంపై ఆరాలు తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్‌మాల్‌ అయినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ అధికారులు వెల్లడించాల్సివుంది. 
 
మరోవైపు, ఈ ఐటీ దాడులపై హీరో విక్టరీ వెంకటేష్ వద్ద ప్రస్తావించగా, ‘ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయా? నిజమా? ఆ విషయం నాకు తెలియదు. మిగతా వాళ్ల విషయాన్ని పక్కనపెడితే.. నేను పారితోషికం మొత్తం వైట్‌లోనే తీసుకుంటా. నేను వైట్‌ వైట్‌. నా రెమ్యునరేషన్‌ కూడా తక్కువే కదా’ అని చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హ్యాపీ బర్త్‌డే లోకేష్ సర్: విద్యార్థులు ఇంకోసారి ఇలా చేయొద్దు.. నారా లోకేష్ (video)

Sharmila or Jagan?: ఏపీలో కూటమి సర్కారుకు విపక్ష నేత ఎవరు? షర్మిలనా? జగనా?

Vijaya Sai Reddy: విజయ సాయి రెడ్డి గారూ.. ఇది ధర్మమా? బండ్ల గణేష్ ప్రశ్న

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

లెట్ ది బీట్స్ డ్రాప్: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ కోసం మీరు అనుసరించాల్సినవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments