మహారాష్ట్రలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను న్యూడ్‌గా నిలబెట్టి వీడియో భర్త వీడియో తీశాడు. ఆ వీడియోను తన స్నేహితుడుకి పంపించాడు. దీంతో స్నేహితుడు మరింత రెచ్చిపోయి... భర్త ముందే ఆ మహిళ ముందు అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ వేధింపులను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు... మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో భర్త తన భార్యకు మత్తుమందు తినిపించి, ఆపై ఆమెను అశ్లీల వీడియో తీశాడు. దీని తర్వాత భర్త ఆ వీడియోను తన స్నేహితుడికి పంపాడు.
భార్య దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు, నిందితుడైన భర్త ఆమెను కొట్టాడు. దీని తర్వాత భర్త స్నేహితుడు ఆ మహిళతో అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ మహిళ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడైన భర్తను అరెస్టు చేశారు.
ఆమెను వివస్త్రను చేసి వీడియో తీశాడు. దీన్ని తన స్నేహితుడుకి పంపించాడు. అంతేకాకుండా తన స్నేహితుడుతో సన్నిహితంగా ఉండేందుకు నిరాకరించిన భార్యపై కూడా భర్త దాడి చేసి గాయపరిచాడు. పరారీలో ఉన్న భర్త స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.