Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే - వ‌ర్మ‌..!

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (15:44 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాని ఈ నెల 29న రిలీజ్ చేసారు. అయితే... ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హైకోర్ట్ స్టే ఇవ్వ‌డం వ‌ల‌న రిలీజ్ కాలేదు. వ‌ర్మ మాత్రం సుప్రీం కోర్టుకి వెళ్లైనా స‌రే ఈ చిత్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రిలీజ్ చేస్తానంటున్నారు.

హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో వ‌ర్మ మాట్లాడుతూ... సుప్రీంకోర్ట్... ప‌ద్మావ‌త్, ఉడ‌తా పంజాబ్ సినిమాలు వివాద‌స్ప‌దం అయిన‌ప్పుడు చాలా క్లియ‌ర్‌గా చెప్పింది ఏంటంటే... ఒక సినిమాకి సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చిన త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోను ఆ సినిమాను ఆప‌డానికి వీళ్లేదు అని రెగ్యులేష‌న్స్ జారీ చేసింది. 
 
అందుక‌నే తెలంగాణ హైకోర్టుకి ఈ సినిమాని ఆపాల‌ని కొంతమంది ఫిర్యాదు చేసిన‌ప్పుడు వెంట‌నే కొట్టేయ‌డం జ‌రిగింది. అయితే.. ఏపీలో ఈ సినిమా విడుద‌ల‌ను ఆపేస్తార‌ని ఊహించ‌లేదు. ఇలా జ‌రిగిన దానికి అస‌లు దీని వెన‌క ఎవ‌రు ఉన్నారో అంద‌రికీ తెలుసు. పేర్లు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పేర్లు చెప్పే ధైర్యం లేక కాదు. ప్ర‌స్తుతం ఇది కోర్టు ప‌రిధిలో ఉంది కాబ‌ట్టి చెప్ప‌డం లేదు. 
 
కానీ... నేను చెప్పినా చెప్ప‌క‌పోయినా ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు అన్నారు. ఈ సినిమాకి రిలీజైన అన్నిచోట్లా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు మీరే అనుకుంటున్నా అని హీరో హర్షవర్ధన్‌ చేసిన ట్వీట్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా వర్మ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments