Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదాలం రీమేక్‌లో పవన్: హాలీవుడ్ స్టోరీనే అజ్ఞాతవాసి

ఎఎం రత్నం కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ నిర్మాణ సారథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అజిత్ వీరం సినిమా రీమేక్ కాటమరాయుడులో నటించిన పవన్, అదే అజిత్ నటించి హిట్టైన వేదాలం

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (15:39 IST)
ఎఎం రత్నం కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ నిర్మాణ సారథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అజిత్ వీరం సినిమా రీమేక్ కాటమరాయుడులో నటించిన పవన్, అదే అజిత్ నటించి హిట్టైన వేదాలం రీమే‌క్‌లో కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి నీసన్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. అజ్ఞాతవాసి సినిమాకు తర్వాత పవన్ వేదాలం రీమేక్‌‍లోనే నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే అవుట్ కావడంతో దర్శకుడు త్రివిక్రమ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నెట్టింట్లో అజ్ఞాతవాసి సినిమాపై చర్చ సాగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ జల్సా, అత్తారింటికి దారేది, వంటి సినిమాలు హిట్టైన తరుణంలో మూడవ సినిమాగా రూపొందుతోన్న అజ్ఞాతవాసిపై అంచనాలు భారీగా వున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ''ది హెయిర్ అప్పారెంట్'' అనే ఓ హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తిని పొందిన త్రివిక్రమ్, ఈ కథను తయారు చేసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. శ్రీమంతుడైన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలుంటారు. హఠాత్తుగా ఆస్తిపరుడైన ఆ వ్యక్తి చనిపోవడంతో.. ఆతని ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఓ గ్యాంగ్ పక్కా ప్లాన్ చేస్తుంది. అయితే ఆ శ్రీమంతుడి మొదటి కుమారుడు ఆ ఆస్తిని ఆ గ్యాంగ్ నుంచి ఎలా కాపాడాడు అనేదే కథని నెటిజన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments