Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ ఆకలితో ఉంది.. తమిళనాడులా ఏపీని కూడా?: జేసీ

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు త

బీజేపీ ఆకలితో ఉంది.. తమిళనాడులా ఏపీని కూడా?: జేసీ
, శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:36 IST)
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మరీ కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. కేంద్రం మాత్రం ఆయన్ని నియంత్రించాలనుకుంటుందని చెప్పుకొచ్చారు.

అందుకే పోలవరం విషయంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. పోలవరం విషయంలో ఏవైనా అనుమానాలుంటే అడిగి తెలుసుకోవాలి కానీ పిలిచిన టెండర్లను ఆపాలనడం సరికాదని జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని జేసీ విమర్శించారు. పోలవరాన్ని ఆపాలని ప్రయత్నిస్తే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని జేసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పాలనాపరమైనవిగా అనిపించట్లేదన్నారు. అంతా రాజకీయ కారణాల వల్లే బీజేపీ అలా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం కనుక ఏపీతో వైరం పెట్టుకుంటే మూడేది వారికేనని జేసీ హెచ్చరించారు. 
 
అంతేగాకుండా బీజేపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో వుంచుకుని.. తమిళనాడులా ఏపీని కబళించాలనే ప్రయత్నాలు కేంద్రం పెద్దలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 15 రోజుల్లో పోలవరం వ్యవహారం చక్కబడుతుందని, లేదంటే పార్లమెంట్‌లో పోరాడతామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...