Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ లవ్‌లో ఫెయిల్ అయ్యాడా..?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:36 IST)
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవ తరంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువ హీరో సుశాంత్. తొలి చిత్రం కాళిదాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుశాంత్.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా.. ఇలా సక్సస్ కోసం ప్రయత్నించినప్పటికీ సరైన ఫలింతం రాలేదు. ఆఖరికి రోటీన్ చిత్రాలకు భిన్నంగా చిలసౌ అనే సినిమా చేసి సక్సస్ సాధించాడు. 
 
ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి అల వైకుంఠపురములో సినిమా చేసాడు. ఈ సినిమా సుశాంత్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 
 
ప్రస్తుతం ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే విభిన్న కథా చిత్రంలో నటిస్తున్నాడు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్న సుశాంత్ మీడియాతో మాట్లాడుతూ... కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. 
 
అవి ఏంటంటే... తను లవ్‌లో ఫెయిల్ అయ్యానని ఓ బాంబ్ పేల్చాడు. అవును.. సుశాంత్‌ని చూస్తే చాలా సైలెంట్‌గా ఉంటాడు. అలాంటిది సుశాంత్ ఎప్పుడు లవ్‌లో పడ్డాడు..? ఎవరితో లవ్‌లో పడ్డాడు..? పడినా.. ఇన్నాళ్లు బయటకు రానియకుండా ఎలా ఉంచాడు అనేది ఆసక్తిగా మారింది. 
 
అయితే... లవ్‌లో పడడం.. ఫెయిల్ అవ్వడంతో బాగా డీలాపడ్డాడట. లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి నెల రోజులు పట్టిందని చెప్పాడు. లైఫ్‌లో ఇలా జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లిపోవాలి అంతే అంటూ వేదాంతం మాట్లాడుతున్నాడు ఈ అక్కినేని చిన్నోడు. జీవిత సత్యం బాగానే తెలుసుకున్నాడు.. ఇక సినిమా జీవితం గురించి కూడా బాగా అర్థం చేసుకుని కెరీర్లో మరిన్ని విజయాలు సాధిస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments