Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ ఫస్ట్ ఫ్యామిలీ వారసుడు రిషి కపూర్... లవర్ బాయ్‌గా గుర్తింపు

బాలీవుడ్ ఫస్ట్ ఫ్యామిలీ వారసుడు రిషి కపూర్... లవర్ బాయ్‌గా గుర్తింపు
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (12:59 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో చెరిగిపోని అనుంబంధం కపూర్ల కుటుంబానికి ఉంది. స్పష్టంగా చెప్పాలంటే బాలీవుడ్‌కు ఫస్ట్ ఫ్యామిలీ కపూర్ల కుటుంబమే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కపూర్ ఫ్యామిలీ ప్రస్తావన లేకుండా చరిత్ర రాయడం అనేది అసాధ్యంతో కూడుకున్నపని. 
 
ఈ కపూర్ల కుటుంబానికి నాలుగు తరాల అనుబంధం ఉంది. తాత పృథ్విరాజ్ కపూర్, తండ్రి రాజ్ కపూర్, బాబాయిలు శమ్మీకపూర్, శశికపూర్, అన్న రణధీర్ కపూర్, మేనమామలు ప్రేంనాథ్, రాజేంద్రనాథ్, నరేంద్రనాథ్, ప్రేం చోప్డా, తర్వాతి కాలంలో తమ్ముడు రాజీవ కపూర్, రణధీర్ కపూర్ పిల్లలు కరిష్మా కపూర్, కరీనా కపూర్, బాబాయిల పిల్లలు ఇలా తరాలుగా దిగ్వజయంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
webdunia
 
ఆ కపూర్ల కుటుంబం నుంచి వచ్చిన హీరోనే రిషి కపూర్. బాల నటుడిగా అతడి కెరీర్‌ను కూడా కలుపుకుంటే బాలీవుడ్‌తో ఐదు దశాబ్దాల అనుబంధం రిషి కుమార్ సొంతం. తండ్రి రాజ్ కపూర్ హీరోగా కెరీర్ చివర్లో తీసిన ఫిలసాఫికల్ చిత్రం "మేరా నామ్ జోకర్"లో బాలనటుడిగా రిషీ కపూర్ నటించాడు. 
 
ఆ నటకుగానూ జాతీయ ఉత్తమ బాలనటుని అవార్డు అందుకున్నాడు. అంతకన్నా ముందే శ్రీ 420లో రాజ్, నర్గీస్ గొడుగు పట్టుకుని ప్యార్ హువా ఇకరార్ హువా అని పాడుతుంటే దూరంగా వర్షంలో తడుస్తూ వెళ్లే పిల్లల్లో రిషీ కూడా ఉన్నాడు.
 
బాలీవుడ్ టాప్ కుటుంబం నుంచి వచ్చిన రిషీకపూర్ 1974లో బాబీతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. గ్రేటెస్ట్ షోమ్యాన్‍‌గా పేరుపొందిన తండ్రి రాజ్‌కపూర్ తీసిన ఆ సినిమా రిషీని తారాపథంలోకి రాకెట్ వేగంతో లాంచ్ చేసింది. రాజ్ కపూర్ మార్కు మ్యూజికల్ హిట్.
webdunia
 
లక్ష్మికాంత్-ప్యారేలాల్ సంగీతంతో రాజ్ చేసిన తొలిసినిమా అంచనాలను మించిపోయింది. నూనూగు మీసాల లేత యవ్వనంలో రిషీ, అమాయకపు చూపుల డింపుల్ కపాడియా పండించిన పసితనపు రొమాన్స్ వెండితెర మీద నిత్యనూతనం. 
 
అలా ఫ్యామిలీ చెట్టునీడన తన కెరీర్ లాంచ్ అయినప్పటికీ రిషీ బాలీవుడ్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. యాంగ్రీ యంగ్‌మ్యాన్ల కస్సుబుస్సుల నడుమ లవర్‌బాయ్‌గా నిలదొక్కుకున్నాడు. అలా, 1952 నుంచి 2020 వరకు తనదైనశైలిలో చెరగని ముద్రవేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిషి కపూర్.. పుట్టు పూర్వోత్తరాలు... సినీ కెరీర్