Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్‌లో ఆ విషయం నాకు నచ్చదు.. విజయ్ సార్ ఓకే : ''అభిమన్యుడు'' విశాల్

కోలీవుడ్‌ అందాల హీరో అజిత్ అంటే నచ్చని వారంటూ వుండరు. విశాల్ మాత్రం అజిత్ హీరోగా సూపర్ అని.. వ్యక్తిగతంగా మంచి పేరున్న వ్యక్తేనని.. కానీ అన్ అవైలబుల్‌గా వుండటం తనకు నచ్చదని చెప్పాడు. అజిత్‌ను కలవాలంటే

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (09:37 IST)
కోలీవుడ్‌ అందాల హీరో అజిత్ అంటే నచ్చని వారంటూ వుండరు. విశాల్ మాత్రం అజిత్ హీరోగా సూపర్ అని.. వ్యక్తిగతంగా మంచి పేరున్న వ్యక్తేనని.. కానీ అన్ అవైలబుల్‌గా వుండటం తనకు నచ్చదని చెప్పాడు. అజిత్‌ను కలవాలంటే చాలా కష్టంతో కూడిన పనంటూ విశాల్ కామెంట్స్ చేశాడు.


అంతేగాకుండా కోలీవుడ్ మరో టాప్ హీరో విజయ్ గురించి కూడా విశాల్ కామెంట్స్ చేశాడు. హీరో విజయ్‌తో అందరితో కలిసిపోతాడని.. తనతో అరగంటైనా మాట్లాడకుండా ఫోన్ పెట్టేయరని విశాల్ కొనియాడాడు. అజిత్‌పై ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశమైనాయి. 
 
ఇతపోతే.. మాస్ హీరోగా తమిళంలోనే కాదు .. తెలుగులోను విశాల్‌కి మంచి క్రేజ్ వుంది. తాజాగా తమిళంలో 'ఇరుంబు తిరై'గా రూపొందిన సినిమాను తెలుగులోకి ''అభిమన్యుడు''గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటించింది. ఇటీవల కోలీవుడ్ చిత్రపరిశ్రమలో జరిగిన సమ్మె కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారం కావడంతో సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా మే 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments