Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీకాంత్ "కాలా" ఇప్పట్లో విడుదల కాదు... ఎందుకో తెలుసా?

ప్రేక్షకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ సమ్మె చేపడుతున్నామని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ స్పష్టం చేశారు. మార్చి ఒకటో తేదీన నుంచి నిర్మాతల మండలి సమ్మె చేస్తోంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి

Advertiesment
రజనీకాంత్
, ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (12:04 IST)
ప్రేక్షకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ సమ్మె చేపడుతున్నామని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ స్పష్టం చేశారు. మార్చి ఒకటో తేదీన నుంచి నిర్మాతల మండలి సమ్మె చేస్తోంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒక్కటంటే ఒక్క కొత్త చిత్రం కూడా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి పలు దఫాలుగా డిజిటల్‌ ప్రొవైడర్లు, థియేటర్‌ యజమానులతో చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలు ఆశాజనకంగా లేకపోవడంతో విశాల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ "చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ నిర్మాతకే తగులుతున్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారయ్యేంత వరకు కొత్త సినిమాలను విడుదల చేయం. మండలి చెబుతున్న డిమాండ్లన్నీ న్యాయమైనవే. అసలు తమ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయన్న విషయం కూడా తెలియడం లేదు. అందుకు థియేటర్‌ యజమానులే కారణం. అందువల్ల టికెట్ల విధానాన్ని కంప్యూటరీకరణ చేయాలి. అప్పుడే అన్ని వివరాలు పారదర్శకంగా ఉంటాయన్నారు.
 
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నదే నా అభిప్రాయం. దీనికి సంబంధించి ఈ నెల నాలుగో తేదీన చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లు కలిసి సచివాలయం దిశగా ర్యాలీ నిర్వహించనున్నాం. అనంతరం దీనికి సంబంధించి మంత్రి కడంబూర్‌ రాజుకు వినతిపత్రానికి అందజేస్తాం. సమ్మెతో కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. అయితే ఈ సమస్యలన్నీ పరిష్కారమైతే.. కార్మికులకు ఇంకా ఉపయోగార్థకంగా ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' కూడా ఈ సమస్యలన్నీ పూర్తయిన తర్వాతే విడుదలవుతుందని" అని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'భరత్ అనే నేను'... ఐ డోంట్ నో అంటున్నాడు... (Audio Song)