Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగ‌ర్ లో సాంగ్ పాడిన ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (19:10 IST)
Vijay,priya, family
తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ప్ర‌ముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒక‌రు. ఇటీవ‌ల ఆమె అభిమాన న‌టుడు విజయ్ దేవరకొండ తనకు శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఆమె ఒకర‌క‌మైన సంబ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆ స‌మ‌యంలో తన తదుపరి చిత్రంలో పాడే  అవ‌కాశం ఇస్తాన‌ని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ.
 
ఇప్పుడు విజ‌య్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న పూరిజ‌గ‌న్నాధ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న‌ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ `లైగర్‌`లో షణ్ముఖ ప్రియతో ఒక పాట పాడించ‌డం ద్వారా త‌న  వాగ్దానాన్ని నెరవేర్చు కున్నారు విజ‌య్ అలాగే షణ్ముఖ ప్రియ కల కూడా సాకారం అయ్యింది.
 
అంతేకాకుండా షణ్ముఖ ప్రియ, ఆమె తల్లిని త‌న నివాసంలో క‌లిశారు విజయ్‌. ఈ సంద‌ర్భంగా  విజయ్ దేవరకొండ తల్లి షణ్ముఖ ప్రియను సత్కరించారు. అలాగే  ఆమెకు కొన్ని బహుమతులు అందజేశారు.
 
మేము నీ పాటను సినిమాలో ఉంచుతాము. అది ఒక చక్కని పాట. దానిని వినడానికి ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం  వింటానని అనుకుంటున్నాను. తొంద‌ర‌గా ఫైన‌ల్ మిక్సింగ్‌కి పంప‌మ‌ని వారిని అడుగుతాను ”అని విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియకు చెప్పారు.
ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరో యిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్  ప‌తాకాల‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మోహతా  నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments