Vijay devarakonda-Shnmuka
ఇండియన్ ఐడియల్ లో విశాఖపట్నంకు చెందిన షణ్ముఖ ప్రియతోపాటు పలువురు యువ గాయనీ గాయకులు పాల్గొన్నారు. ఇండియన్ ఐడియల్ గ్రేటెస్ ఫినాలో ఆమె పాటలకు వచ్చిన స్పందన చూసి విజయ్‌దేవరకొండ లైవ్‌లో ఆమెతో మాట్లాడారు. శనివారంనాడు తన ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమెతో మాట్లాడుతూ,, షణ్ముక తల్లిదండ్రులనుద్దేశించి, మీరు పక్కనే వుంటూ ష్మణుక పాడుతుంటే లిప్‌సింక్ ఇస్తుంటే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. షణ్ముక, నీతోపాటు ఇందులో పాల్గొన్నవారందరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నా. ముఖ్యంగా నీకు. గెలుపు, ఓటములు మర్చిపో. ఇదొక తీపి జ్ఞాపకం. అధైర్యపడవద్దు. నువ్వు హైదరాబాద్ రాగానే నన్ను కలుస్తున్నావ్. నా సినిమాలో పాడుతున్నావ్. గుడ్ లక్ అంటూ ధైర్యాన్ని నింపారు.
దీనికి షణ్ముఖ ప్రియకంటే వారి తల్లిదండ్రులు మరింత ఖుషీ అయ్యారు. అక్కడ పాల్గొన్న వారు, చూసే ప్రేక్షకులు మరింత ఆనందంలో మునిగిపోయారు. జడ్జిలంతా విజయ్‌దేవరకొండ వంటి నటుడు నీకు ఆశీర్వాదం ఇస్తే ఎలా అనిపిస్తుంది అని షణ్ముఖను ప్రశించగానే, సంతోషంతో మాటలు రావడంలేదు. ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావడంలేదు. విజయ్‌దేవరకొండగారు ఇంత పెద్ద సపోర్ట్ ఇస్తారని అస్పలు అనుకోలేదు. థ్యాక్స్ యూ సార్. అంటూ ఆనందంతో పొంగిపోయింది. ఈ కార్యక్రమం సోనీలో రేపు ప్రసారం కానుంది.
షణ్ముఖ ప్రియ కర్ణాటక సంగీతం, జాజ్, మోడెలింగ్‌లో ప్రత్యేకత కలిగిన గాయని. ఆమె అనేక రియాలిటీ టెలివిజన్ షోలలో కనిపించింది, ఇందులో పాదుత తీయగా ఎస్ 6, సా రే గా మా పా లిల్ చాంప్స్ 2017 మరియు ఇండియన్ ఐడల్ 12 వంటివి ఉన్నాయి.