Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌‌ల సత్తా: ఐమ్యాక్స్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (19:56 IST)
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించగా సూపర్‌స్టార్స్‌ జూనియర్‌ ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ ముఖ్యపాత్రలలో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మార్చి25, 2022న అంతర్జాతీయంగా విడుదల కాబోతుంది. అజయ్‌ దేవగన్‌,  అలియాభట్‌ వంటి వారు నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఐమ్యాక్స్‌లో కూడా విడుదల చేయబోతున్నారు.

 
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర రూపకర్తలతో కలిసి ఐమ్యాక్స్‌ సంస్థ ఈ విషయాన్ని తెలుపుతూ ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఐమ్యాక్స్‌ సంస్ధ ఈ చిత్రాన్ని యుఎస్‌ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యుకె మరియు మిడిల్‌ ఈస్ట్‌తో పాటుగా ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

 
బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాయనుందని అంచనా వేస్తోన్న ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ డ్రామా హిందీ, మలయాళం, కన్నడ, తమిళంతో పాటుగా తెలుగులో కూడా విడుదల కానుంది. 1920లలో జరిగిన ఓ కాల్పనిక గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లుగా రామ్‌చరణ్‌, జూనియన్‌ ఎన్‌టీఆర్‌ కనిపించనున్నారు. ఈ కాల్పనిక గాథలో స్వాతంత్య్ర సమరయోధులైన ఇద్దరు స్నేహితులు కలిస్తే ఎలా ఉంటుందన్న ఊహకు ప్రతిరూపమిచ్చారు.

 
ఆర్‌ఆర్‌ఆర్‌తో భారతీయ చిత్రాలపై తమ దృష్టిని సారించిన ఐమ్యాక్స్‌, ఇప్పుడు ప్రేక్షకులకు అద్వితీయ అనుభవాలను అందించడానికి సిద్ధమైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఐమ్యాక్స్‌ పోస్టర్‌ ఈ చిత్రం పట్ల వీక్షకుల అంచనాలను మరింత పెంచే రీతిలో ఉంది. భీమ్‌గా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ మరియు రాజుగా రామ్‌చరణ్‌‌ల హీరోయిజాన్ని అద్భుతంగా చూపే రీతిలో ఈ పోస్టర్‌ సంచలనాలను సృష్టిస్తుంది. భారతదేశంలోని ఐమ్యాక్స్‌ స్ర్కీన్స్‌ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నా వదినా అంటూ నా ప్రియుడితో సరసాలా? ముక్కోణపు ప్రేమలో యువతి మృతి

ప్రేమ వివాహాలకు వేదిక కానున్న సీపీఎం కార్యాలయాలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments