Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ హీరోగా హత్య

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (19:51 IST)
Vijay Antony
డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య' తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
'1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య'  సినిమా సాగనుంది. అందమైన మోడల్ లీల తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు అనేది మిస్టరీగా మారుతుంది. డిటెక్టివ్, పోలీస్ కోణంలో ఈ కేసు ఛేదనలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు.
 
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో 'హత్య' సినిమా నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments