S.S. Rajamouli blessing to Gali Kiriti
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించింది. ఇప్పుడు కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిని హీరోగా పరిచయం చేయడానికి మరో భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనుంది. ఇది రాధా కృష్ణ దర్శకత్వం వహించనున్న తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్రవారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కర్ణాటక రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.
ముహూర్తం షాట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ కొట్టగా, కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కెమెరా స్విచాన్ చేశారు.
Kiriti, S.S. Rajamouli, Genelia, Srilila
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. కిరీటీని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రామిసింగ్‌గా కిరీటీ లుక్స్ వున్నాయి. నటుడికి కావాల్సిన నటన, నృత్యం, ఫైట్స్ తను చేయగలడు. వారాహి చలనచిత్రం బేనర్‌లో ఆయనను చూడటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక సిబ్బంది అయిన సెంథిల్ కుమార్, రవీందర్, DSP కెమెరా, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ విభాగాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో రవి సర్, జెనీలియా, శ్రీలీల వంటి అద్భుతమైన తారాగణం కూడా ఉంది. రవి సార్ కిరీటికి మంచి గైడెన్స్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
జెనీలియా మాట్లాడుతూ ''నేను నటనకు దూరమై 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ ముందుకు వచ్చాను. ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. తొలిసారిగా నటిస్తున్న కిరీటికి గుడ్‌లక్. ఈ చిత్రాన్ని భారీ నిర్మాతతో పాటు అద్భుతమైన నటీనటులు ఉన్నారు. మళ్ళీ గేప్ తీసుకున్నా ఈ చిత్ర యువ టీమ్‌లో న్యూ కమర్‌గా నేను జాయిన్ అయినట్లుగా ఫీలవుతున్నాను అన్నారు.
శ్రీలీల మాట్లాడుతూ ''ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. మమ్మల్ని ఆశీర్వదించిన రాజమౌళి సార్, రవి సార్ కు ధన్యవాదాలు. నేను, కిరీటి నిజానికి కుటుంబ స్నేహితులం. కిరీటి చాలా కష్టపడితే తత్త్వం ఉంది. నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. అందమైన కథ, అద్భుతమైన బృందం, అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఉన్న సినిమా ఇది. అయితే, జెనీలియా మేడమ్ పనిచేయడం ఆమకు పెద్ద అసెట్‌గా భావిస్తున్నాను. 10 ఏళ్లు గడిచినా ఆమె లుక్ అలాగే ఉంది` అన్నారు.
హీరో కిరీటి మాట్లాడుతూ - ''నేను సినిమాల్లోకి రావడానికి అప్పు సర్ స్ఫూర్తి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కొర్రపాటికి ధన్యవాదాలు. మేము కుటుంబ స్నేహితులం. వారు ఈ ప్రాజెక్ట్‌ను బాగా చూసుకుంటున్నాడు. అప్పు సర్ కి దొరికిన వ్యక్తి రాధా కృష్ణ. గొప్ప అరంగేట్రం అప్పు సార్‌కు ఇచ్చారు. మా సినిమాతో జెనీలియా మళ్లీ వచ్చినందుకు చాలా ఎగ్జైట్‌గా, ఎమోషనల్‌గా ఉంది. రవి సర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. శ్రీలీల నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను ఆమెతో కలిసి నటించడానికి ఎదురు చూస్తున్నాను. అద్భుతమైన సాంకేతిక నిపుణులతో పని చేయడం నా అదృష్టం - సెంథిల్ కుమార్ సర్, రవీందర్ సర్, పుష్ప కోసం తన సంగీతంతో భారతదేశాన్ని షేక్ చేసిన DSP సర్‌తో కూడా పని చేయడం నా అదృష్టం. పీటర్ హెయిన్‌తో కలిసి పనిచేయడం నాకు కూడా చాలా ఇష్టం. సినిమాలో కిక్‌కి తగ్గ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. నేను కష్టపడి పని చేస్తానని, నా ఉత్తమమైన పెర్‌ఫార్మెన్స్ అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అన్నారు.
శివ రాజ్‌కుమార్ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ, “జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటికి ఆల్ ది బెస్ట్. తనలో చురుకుదనం వుంది. కిరిటీ పరిచయానికి సంబంధించిన వీడియో చూశాను. అతని డ్యాన్సులు అద్భుతంగా ఉన్నాయి. కన్నడ, తెలుగు ఇండస్ట్రీలకు మంచి హీరో అవుతాడు. అతను పాన్-ఇండియా స్టార్ కూడా కావచ్చు. ఆల్ ది బెస్ట్ తోపాటు ఇండస్ట్రీకి స్వాగతం పలుకుతున్నా.. రాధా కృష్ణ ప్రామిసింగ్ డైరెక్టర్. సాయి కొర్రపాటి మంచి స్నేహితుడు. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ కలుస్తుంటాం. కిరీటీ, కష్టపడి పని చేయండి, క్రమశిక్షణతో నిజాయితీగా పని చేయండని సూచించారు.
మేకర్స్ కిరీటిని పరిచయం చేసే గ్లింప్స్‌ను కూడా విడుదల చేసారు ఇది కిరీటీలోని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది. కిరీటి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకునేలా వుంది. స్టైలిష్‌గా కనిపించాడు. అతని నటనలోనూ గ్రేస్ ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే, అతను తన సినిమా అరంగేట్రం కోసం పూర్తిగా సిద్ధమయ్యాడు. అతను కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా చేశాడు.
యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందబోతోంది. వారాహి చలనచిత్రం యొక్క ప్రొడక్షన్ నంబర్ 15లో కొంతమంది ప్రముఖ నటీనటులు కూడా నటించనున్నారు. అత్యంత పాపులర్ నటీమణులలో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో తిరిగి వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కీలక పాత్రలో కనిపించనున్నారు. విభిన్న క్రాఫ్ట్‌లను నిర్వహించడానికి మేకర్స్ అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను కూడా ఎంచుకున్నారు.
సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, బాహుబలి లెన్స్‌మెన్ కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్, భారతదేశపు టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫ్ చేస్తారు.
విభిన్న క్రాఫ్ట్‌లను నిర్వహించడానికి మేకర్స్ అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను కూడా ఎంచుకున్నారు.
తారాగణం: కిరీటి, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి తదితరులు నటించనున్నారు.