Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్‌, చిరంజీవిల‌కు నేను ఇడ్లీనే పెట్ట‌గ‌ల‌ను - మారుతీ

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:55 IST)
Director maruti
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, మెగాస్టార్ చిరంజీవిల‌తో సినిమా వుంది. అది త్వ‌ర‌లో తెలియ‌జేస్తానని ద‌ర్శ‌కుడు మారుతి వెల్ల‌డించారు. ఏ సినిమా చేసినా నాకంటూ ఓ ఫార్మెట్ వుంటుంది. దానిని బ‌ట్టే సినిమా తీస్తాను. ఓ చోట చెఫ్‌కు ఇండియ‌న్ వంట బాగా వ‌చ్చు. ఆయ‌న‌కోసం అంద‌రూ అక్క‌డికే వెళ‌తారు. కానీ కొత్త‌గా ప్ర‌యోగం చేశాను చైనీస్ వంట‌కం వండాను. తిన‌మంటేఎవ్వ‌రూ తిన‌రు. రారు కూడా. అలాగే ప‌లానా చోట ఇడ్లీ బాగా చేస్తాడు అని తెలిస్తే ఇడ్లీ కోసమే జ‌నాలు వెళ‌తారు. ఇడ్లీలు చేసే వాడికి బోర్ కొట్టి ఇడ్లీ బదులు బ‌జ్జీలు వేసినా జ‌నాలు వెళ్ళ‌రు. నేను కూడా అంతే. ప్ర‌భాస్, చిరంజీవిల‌కు క‌థ‌ను చెప్పాను. వారికి న‌చ్చింది. నాకు న‌చ్చిన వంట‌కంలా సినిమా చేస్తాను.
 
వారి సినిమాలు ఎలావుంటాయ‌నే ప్ర‌శ్న‌కు మారుతీ పైన ఉదాహ‌ర‌ణాలు వెల్ల‌డించాడు  నా నుంచి చిరంజీవిగారికి, ప్ర‌భాస్‌కు నా నుంచి ఎటువంటి సినిమా రాబ‌ట్టుకోవాలో వారికి తెలుసు. దానికి అనుగుణంగానే సినిమా చేస్తాను. పెద్ద సూప‌ర్ మార్కెట్‌లో వేల రూపాయ‌లు ఖ‌రీదుచేసే వ‌స్తువులు అమ్ముతారు. అందులోనూ బబుల్‌గ‌మ్ కూడా అమ్ముతారు. ఇంత పెద్ద మార్కెట్ బ‌బుల్‌గ‌మ్ అమ్మడం ఏమిటి? అనేది భావించ‌కూడ‌దు. అలాగే నా ద‌గ్గ‌ర స్ట‌ఫ్ వుంది. పెద్ద సినిమాలు చేయ‌గ‌ల‌ను. చిన్న సినిమాలు చేయ‌గ‌ల‌ను. నేను చేసిన `మంచిరోజులు వ‌చ్చాయ్‌` అనే సినిమా బ‌బుల్‌గ‌మ్‌లాంటి సినిమా అంటూ క్లారిటీ ఇచ్చాడు మారుతీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments