ఈ వంకాయ్‌లు.. శ్రీదేవి బుగ్గల్లా నవనవలాడుతున్నాయి... కొరికెయ్ అల్లుడుగారు...

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (10:51 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "పక్కా కమర్షియల్" మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు దివంగత రావుగోపాలరావు వాయిస్‌ని అనుకరించారు. ఈ సినిమాలో రావుగోపాలరావు తనయుడు రావు రమేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఈ సందర్భంగా దివంగత సీనియర్ నటుడు రావు గోపాల్ రావుతో ఉన్న పరిచయాన్ని ఓసారి గుర్తు చేసుకున్నారు. అల్లు రామలింగయ్య, రావు గోపాల రావులు అన్నదమ్ములు అయితే, రావు గోపాల రావు తనకు చిన్న మామయ్య అవుతారన్నారు. 
 
ఆయన లంచ్ సమయంలో రావు గోపాల రావు ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తూ, ఆయన నా కోసం ప్రత్యేకంగా వంటకాలు తెచ్చి వడ్డించేవారని చెప్పారు. ముఖ్యంగా, వంకాయ కూర వడ్డిస్తే నేను తినడానికి ఇష్టపడేవాడిని కాదన్నారు. 
 
అపుడు రావు గోపాల రావు కల్పించుకుని... వంకాయ అని తీసిపారేయొద్దయ్యా.. ఈ వంకాయ చూడు ఎంతగా నవనవలాడిపోతోందో.. శ్రీదేవి బుగ్గాల్లా కసక్కన కొరికి తినెయ్ అంటూ చమత్కరించేవారన్నారు. 
 
ఇపుడు ఆయన లేని లోటను రావు రమేష్ తీర్చుతున్నారన్నారు. రావు రమేష్ నటనా నైపుణ్యాన్ని మెచ్చుకున్న చిరంజీవి, అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఆ మాటలు విన్న రావు రమేష్ ఉద్వేగానికిలోనై చిరంజీవి పాదాలను తాకారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి - మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments