Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ‌ను కాల్పుల ఘ‌ట‌న‌లో కాపాడాను. ఆ త‌ర్వాత న‌న్ను మ‌ర్చిపోయారు.

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:25 IST)
balayya
ఎప్పుడో జ‌రిగిన సంఘ‌ట‌న‌. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు. వై.ఎస్‌. రాష్ట్ర ముఖ్య‌మంత్రి. అలాంటి టైంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటిలో కాల్పుల క‌ల‌క‌లం రేగింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ పై బాల‌య్య ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే కాల్పులు. బాల‌య్య ఆయ‌న‌పై తుపాకితో కాల్చి చంపార‌నేది వార్త పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ త‌ర్వాత సురేష్ ఆసుప్ర‌తిలో చావుబ‌తుల‌మ‌ధ్య పోరాటం చేశాడ‌నే చెప్పాలి. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టిరోజే బాల‌య్య ఇంటి సెక్యూరిటీ గార్డ్ ఒక‌రు చ‌నిపోవ‌డం మ‌రో విశేషం. ఇది దేశ‌మంతా మీడియాలో చ‌ర్చ జరిగింది.

ఆ టైంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు స్వ‌యాన బావ అయిన చంద్ర‌బాబునాయుడు చ‌క్రం తిప్పాడ‌నే వార్త‌లు తెలియ‌జేస్తున్నాయి. బాల‌కృష్ణ‌ను ఎట్ట‌కేల‌కు కాపాడాడు అని లోకానికి తెలిసిపోయింది. అయితే అస‌లు అక్క‌డేం జ‌రిగింది? అనే విష‌యాన్ని ఆ త‌ర్వాత కొంత కాలానికి నిమ్స్ ఆసుప‌త్రి స్థాపనలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు కాకర్ల సుబ్బారావు ఎబి.ఎన్‌. ఇంట్య‌ర్వూలో బాల‌య్య కాల్పుల‌పై స‌మాధాన‌మిచ్చారు. అది అప్ప‌ట్లో అంద‌రూ విన్నారు. కానీ దానిని మ‌ర‌లా మ‌రోసారి వినేందుకు ఆర్‌.కె. యూట్యూబ్‌లో విడుద‌ల‌చేశారు.
 
ఇప్పుడు కాక‌ర్ల‌గారు చ‌నిపోవ‌డంతో ఆ ఇంట‌ర్వ్యూను మ‌ర‌లా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చేసిన దానిని యూట్యూబ్‌లో పెట్టారు. అది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆరోజు ఏం జ‌రిగింది? మీరే బాల‌కృష్ణ‌ను కాపాడారు అని అంటున్నారు నిజ‌మేనా? అని అడిగితే కాక‌ర్ల‌గారు స‌మాధాన‌మిస్తూ,

అవును. నాకు మనస్సులో ఏవిధంగానైనా బాల‌కృష్ణ‌ను కాపాడాలి అని ఉంది. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌ను ఇద్ద‌రు సైక్రియాటిస్ట్‌లు చూశారు. బాల‌య్య సైకోలా మారిపోయాడు. అందువల్ల ఇద్దరు పెద్ద సైకియాట్రిస్టులను పిలిచి చూడమన్నాను. వారు చూశాక ఆయ‌న అలా కాల్పులు జ‌ర‌ప‌క‌పోతే త‌న‌కుతానే కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోనేవాడు అని చెప్పారు కాక‌ర్ల‌. ఆ టైంలో నేను కూడా కాపాడాల్సి వ‌చ్చింది. ఆ ల‌క్ష‌ణాలు వున్న వారు అలానే ప్ర‌వ‌ర్తిస్తారు. ఆ సమయంలో అవతలి వాళ్లకు ఏమైనా చేయాలి. లేకుంటే తనకు తానే ఏదైనా చేసుకోవాలి. ఆదృష్టితోనే అలా చేశారు అని వివ‌రించారు కాక‌ర్ల‌. 
 
అయితే మీరు సానుభూతితో హెల్ప్ చేశారు. మ‌రి ఆయ‌న మీకు మేజ‌ర్ హెల్ప్ ఏవైనా చేయ‌లేదా. మీ ట్ర‌స్ట్‌కు ఏవైనా? అని ఆర్‌.కె. అడ‌గ‌గానే, వ‌ద్దులేండి. ఆయ‌న ఏమీచేయ‌లేదు. అంటూ క‌ట్ చేశారు. నేను అంద‌రినీ క్ష‌మిస్తాను. కోపం ఎంత‌కాలం పెట్టుకుంటాం. ఆ త‌ర్వాత ఆయ‌న ఏమీ చేయ‌లేదు. ప్ర‌పంచంలో ఎన్నో చూస్తుంటాం. అంటూ ముక్త‌స‌రిగా ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments