Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మ‌హాస‌ముద్రం` సిద్దార్ద్ ఫ‌స్ట్ లుక్

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (18:52 IST)
Siddharth First Look
తెలుగులో మ‌ర‌లా ఓ మంచి సినిమాతో ముందుకు రావాల‌నుకున్న హీరో సిద్ధార్థ్ ఇప్పుడు `మ‌హాస‌ముద్రం` ద్వారా రాబోతున్నాడు. ఇందులో శ‌ర్వానంద్ కూడా వున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెల‌ర‌కెక్కిస్తున్నాడు. శ‌ర్వానంద్‌, సిద్దార్డ్ స‌మాన స్థాయి పాత్ర‌లుగా వుంటాయ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.
 
శ‌నివారం హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ మహాసముద్రంలోని అతని ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇటీవ‌ల విడుద‌లైన తన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ‌ర్వానంద్ కొంచెం అగ్రెసివ్ లుక్‌లో కనిపించగా, సిద్ధార్థ్  మాత్రం ప్రశాంతంగా క‌నిపిస్తున్నారు. బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్‌లో ఉన్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆకర్షణీయంగా ఉంది. ఒక పొడవైన క్యూలో నిలబడి ఎవ‌రినో చూస్తున్న‌ట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్ర‌స్తుతం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌19న విడుద‌ల ‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.
 
ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు.
చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments