Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

దేవీ
గురువారం, 20 నవంబరు 2025 (18:34 IST)
Bhagyashree Borse
మహేష్ కథ చెప్తున్నప్పుడు నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటంటే... అభిమానం అనేది డివైన్ ఎమోషన్. నేను నార్త్ నుంచి సౌత్ కొచ్చినప్పుడు ఇక్కడ అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్ ని ఇంత గొప్పగా ఆరాధిస్తారో ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. అది నిజంగా చాలా గొప్ప ఎమోషన్. ఎలాంటి రిలేషన్ లేకుండా పరిచయం లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారు అనిపించేది. మహేష్ ఈ కథ చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు.
 
రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా తో అలరించబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
-ఆంధ్ర కింగ్ లో నేను మహాలక్ష్మి క్యారెక్టర్ లో కనిపిస్తాను. తను కాలేజ్ గోయింగ్ గర్ల్. సాగర్ తో ప్రేమలో ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు ఎక్కువ క్యారెక్టర్ గురించి రివిల్ చేయకూడదు. రామ్ గారితో నటించడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ . వెరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. లవ్ స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి.  రామ్ గారు చాలా పాజిటివ్ గా ఉంటారు.
 
- ఇది 2000లో జరిగే కథ, డైరెక్టర్ గారు కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్నిటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళాం. అక్కడ చాలా వేడిగా ఉంది. అయితే ఒక టీం గా సినిమా కోసం వర్క్ చేయడంలో చాలా ఎంజాయ్ చేశాం.
 
- ఫ్యూచర్లో నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. అయితే వచ్చిన ప్రతి క్యారెక్టర్ కి 100% ఇచ్చి ఒక వెర్సటైల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది. అనుష్క, అరుంధతిలో చేసినటువంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments