Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ram potineni: ఆంధ్ర కింగ్... అభిమాని ప్రేమలో పడితే ఏమయింది...

Advertiesment
Ram Pothineni, Bhagyashree Borse

చిత్రాసేన్

, సోమవారం, 13 అక్టోబరు 2025 (08:01 IST)
Ram Pothineni, Bhagyashree Borse
సినీ హీరో అభిమానికి వీరాభిమాని అయిన వ్యక్తిని ఓ అమ్మాయి ప్రేమిస్తే సక్సెస్ అయిందా. లేదా? అనే పాయింట్ తో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం రూపొందుతోంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. సినీ హీరోగా ఉపేంద్ర నటిస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.  రామ్ క్యారెక్టర్, సినిమా కథాంశం గురించి ఒక గ్లింప్స్ ఇచ్చారు.
 
రామ్  సినిమాలను ఆరాధిస్తూ, ఆంధ్ర కింగ్ ని ఆరాధిస్తూ పెరుగుతాడు. అంకితభావంతో ఉన్న అభిమానిగా, అతను తన అభిమాన స్టార్ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటాడు. అతనిని సమర్థిస్తూ గొడవల్లో కూడా పాల్గొంటాడు.  అతను తన హీరోని ఎంతగా ప్రేమిస్తాడో, అంతే తీవ్రంగా అతన్ని ప్రేమించే ఒక అమ్మాయి ఉంది. మురళి శర్మ చెప్పిన హార్డ్ హిట్టింగ్ డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది.
 
రామ్‌ పోతినేని ఈ చిత్రంలో ఒక సినిమా అభిమాని పాత్రలో ఒదిగిపోయారు. ప్రతి హీరో అభిమానికి ఈ పాత్రలో తామే ఉన్నట్టు అనిపించేలా నటించారు. తన ఎనర్జీ తో రామ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్స్‌ రామ్‌ లవ్ క్యారెక్టర్ లో గ్రేస్‌ఫుల్‌, ఎమోషనల్ గా కనిపించింది. రామ్‌ తల్లిదండ్రులుగా రావు రమేష్‌, తులసి బాగా న‌టించారు. రామ్‌ స్నేహితుడిగా సత్య హ్యుమర్ అందించగా, ఒక సీన్‌లో మురళీ శర్మ ఆకట్టుకున్నారు.
 
సిద్ధార్థ్‌ నూని సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. వివేక్‌–మర్విన్‌ సంగీతం టీజర్‌ టోన్‌కి తగినట్టుగా మారుతూ, కథను మరింత  ఎట్రాక్టివ్ గాన వుంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అద్భుతమైన వర్క్ అందించారు.
ఈ సినిమా వంబర్‌ 28న థియేటర్లలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Thaman: అఖండ 2: తాండవం లో పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, అతుల్‌ మిశ్రా బ్రదర్స్ ఎంట్రీ