Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

Advertiesment
Ram Pothineni

దేవీ

, సోమవారం, 17 నవంబరు 2025 (11:51 IST)
Ram Pothineni
రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
 
ఫ్యాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన బయోపిక్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌  అనౌన్స్‌మెంట్‌ నుంచే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ‘పుష్ప’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్, ఈ సినిమాను ప్రేక్షకుల జీవితాలను ప్రతిబింబించే యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా అందించబోతున్నారు.
 
వివేక్–మెర్విన్ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి.  సాంగ్స్ కోసం తొలిసారిగా రామ్ పోతినేని రైటింగ్‌, వోకల్స్‌ ఇవ్వడం అందరినీ అలరించింది. రామ్, భాగ్య శ్రీ  కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
ప్రేక్షకుల డిమాండ్, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో విడుదలను ఒక రోజు ముందుకు జరపాలనే నిర్ణయం జరిగింది.
 
మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తోంది. ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
ట్రైలర్‌ను నవంబర్ 18న కర్నూలులో భారీ పబ్లిక్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఇదే తొలిసారిగా జరగనుంది.
 
రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
సినిమాటోగ్రఫీని సిద్ధార్థ నుని నిర్వహించగా, ఎడిషనల్ వర్క్ జార్జ్ సి విలియమ్స్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్.
 
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి