Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

చిత్రాసేన్
గురువారం, 9 అక్టోబరు 2025 (17:53 IST)
Telusukada - Srinidhi Shetty
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
- ఆ మధ్య రణబీర్ సింగ్ సరసన సీత పాత్ర కోసం బాలీవుడ్ లో ఆడిషన్ కు వెళ్ళా. మంచి పాత్ర అని ఆనందపడ్డా. కానీ ఎందుకనే మిస్ అయింది. సాయిపల్లవి ఆ ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇటీవలే వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో నేను చేస్తున్నానని సోషల్ మీడియాలో అంటున్నారు. నిజంగా నాకు తెలీదు. కానీ ఆ సినిమా అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది నిర్మాతలే చెబుతారు.
 
- తాజాగా తెలుసుకదా లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. కేజిఎఫ్, హిట్ త్రీ యాక్షన్, చాలా బ్లడ్ బాత్ ఉన్న సినిమాలు. తెలుసు కదా ఒక లైట్ హార్టెడ్ మూవీ చాలా కొత్తగా ట్రై చేశాం.  తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.
 
- ఈ కథ లో ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి వున్నప్పుడు ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అనుకుంటారు. కానీ తెలుసు కదాలో ఒక యూనిక్ పాయింట్ ని టచ్ చేశాం. అది ఇప్పుడు రివిల్ చేయకూడదు. సినిమా చూసినప్పుడు మీరు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు.
 
-నాకు రొమాంటిక్ స్టొరీస్ చేయడం ఇష్టం. తెలుసు కదాలో మంచి లైట్ హార్ట్టెడ్ ఎంటర్టైన్మెంట్ వుంది. హిట్ 3 కి ముందే ఈ కథ విన్నాను. కథ చాలా నచ్చింది. అయితే ముందుగా హిట్3 రిలీజ్ అయ్యింది.
 
-తెలుసు కదాలో లవ్ ఎమోషన్ లాఫ్ సాంగ్స్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు.
 
-సిద్దుకి అన్నీ డిపార్ట్మెంట్స్ లో చాలా నాలెడ్జ్ వుంటుంది. ఒక యాక్టర్ కి అన్ని విభాగాలపై పట్టు వుండటం అదృష్టం. తన టైమింగ్ అద్భుతం,
 
-రాశి ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. తన డైట్, వర్క్ అవుట్ అన్నీ పద్దతిగా వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments