Venkatesh and Trivikram Srinivas
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఆమధ్య రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. తాజా సమాచారం మేరకు నిన్న హైదరాబాద్ శివార్లో షూటింగ్ ప్రారంభమైంది. గతంలో వీరికలయికలో నువ్వునాకు నచ్చావ్ వచ్చింది. అయితే మల్లీశ్వరి సినిమాకు త్రివిక్రమ్ రచయిత. వెంకటేష్ కు 77వ సినిమా ఇది. దాదాపు 20 నెలల సుదీర్ఘ తర్వాత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు కెమెరా వెనుక తిరిగి వచ్చారు.
కాగా, సమాచారం మేరకు నేడు సినిమాలోని పాటల గురించి మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్. రాధాక్రిష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇదిలా వుండగా, వెంకటేష్ తో పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందించనున్నారు త్రివిక్రమ్. గతంలోనే మల్లీశ్వరికీ సీక్వెల్ వుంటుందని సూచాయిగా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ఆ తరహాలోనే వుంటుందని ఫిలింనగర్ కథనాలు తెలియజేస్తున్నాయి.