Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

డీవీ
మంగళవారం, 26 నవంబరు 2024 (15:49 IST)
Siddharth, Ashika Ranganath
హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు.  ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సిద్ధార్థ్ తో పాటు హీరోయిన్ ఆశిక రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.
 
సిద్ధార్థ్ మాట్లాడుతూ... డైరెక్టర్ రాజశేఖర్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా రోజుల తరువాత ఒక క్యూట్ లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. గిబ్రాన్ ఈ సినిమా కోసం ఎనిమిది సూపర్బ్ ట్యూన్స్ ఇచ్చారు. మ్యూజికల్ లవ్ స్టొరీ గా మిస్ యు సినిమా నవంబర్ 29న థియేటర్స్ లో రాబోతోంది. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది, ఆడియన్స్ తప్పకుండా ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారని అనిపిస్తుంది. 
 
ఈ చిత్ర నిర్మాత శామ్యూల్ మాత్యుస్ డైరెక్టర్ రాజశేఖర్ అడిగింది ఇచ్చారు, సినిమాను మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్ తో నిర్మించారు, మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత, ఈ జననేషన్ లో ఉన్న యంగ్ స్టర్స్ కు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతారు, అన్ని ఎలిమెంట్స్ తో మిస్ యు సినిమా రాబోతోంది. ఈ సినిమా తరువాత నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి. మిస్ యు సినిమాను తెలుగులో నవంబర్ 29న రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ సంస్థ కు ప్రేత్యేక కృతజ్ఞతలు. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో మీముందుకు రాబోతున్నాను అన్నారు.
 
లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దార్థ్ మునుపటిలా తనలోని రొమాంటిక్ వైబ్స్ చూపించబోతున్నాడు. అదే విధంగా ఈ చిత్ర కథ ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉండబోతోంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ.. ప్రేమలో ఉన్న బలహీనతల చుట్టూ ఈ చిత్ర కథ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments