నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, రుక్మిణి వసంత్, దివ్యాన్షా కౌశిక్, జాన్ విజయ్, అజయ్, వైవా హర్ష, సత్య తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్, సంగీత దర్శకుడు : కార్తీక్, ఎడిటింగ్ : నవీన్ నూలి, నిర్మాతలు : బివిఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు : సుధీర్ వర్మ
కథ: రిషి (నిఖిల్)కి కార్ రేసింగ్ కావాలనేది కోరిక. దీనిలోనే మంచి లైఫ్ వుందని డిసైడ్ తో చిన్నపాటి రేసుల్లో పాల్గొంటాడు. ఆ క్రమంలో కాలనీలో ఉండే తార(రుక్మిణి వసంత్) లవ్ ఎట్ ఫస్ట్ లో ప్రేమిస్తాడు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటనతో కొంత అపార్థం చేసుకుంటాడు. అదేటైంలో రేసర్ గా ఆఫర్ రావడంతో లండన్ వెళ్తాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్) పరిచయమై తనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు.
కానీ పెళ్లి రోజు తులసి మిస్ అవుతుంది. ఇక అక్కడ డాన్ కు చెందిన ఓ డివైస్ మిస్ అవుతుంది. దాన్ని వెతికే క్రమంలో అనుకోకుండా రిషి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అసలు డివైజ్ లో ఏముంది? తులసి ప్రేమ ఏమయింది. మరోవైపు తార కూడా లండన్ వస్తుంది. ఆమె ఎందుకు వచ్చింది? అనే విషయాలు మిగిలిన సినిమా.
సమీక్ష: నిఖిల్ స్వామిరారా వంటి సినిమాలు చేశాక కార్తికేయ2తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈసారి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ మన ముందుకు వచ్చారు. ఇది ఒకరకంగా పాత కథలా అనిపిస్తుంది. లవ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయాలనుకున్నారు. అందుకే దర్శకుడు సుధీర్ వర్మ గ్రిప్పింగ్ కథ... కథనాలుండే మరో మంచి ఫీల్ గుడ్ లవ్ థ్రిల్లర్ ను తనకు బాగా కనెక్ట్ అయిన నిఖిల్ తో తీశారు. గతంలో వీరిద్దరి కాంబోలో స్వామి రారా, కేశవ సినిమాలు వచ్చి మెప్పించాయి. ఇప్పుడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తీశారు. కానీ ఈ కథ రన్లో కొంచెం ప్రేక్షకుడు అర్థం చేసుకోవడం కష్టంగా వుంటుంది. ఇక సెకెండాఫ్ తో కనెక్ట్ అయిపోతాం.
ఎందుకంటే సెకెండాఫ్ లో అసలు కథ, ఎయిమ్ అనేది తెలియపర్చాలి కనుక దాన్ని ట్విస్టులు థ్రిల్లింగ్ గా చెప్పగలిగాడనే చెప్పాలి. కానీ ఎక్కువ భాగం లండన్ లో సాగడంతో కాస్త కొత్తదనంగా అనిపిస్తుంది. రేసింగ్ కథ కాబట్టి యాక్షన్ సన్నివేశాలు నచ్చేవారికి థ్రిల్ కలిగిస్తాయి. బాలీవుడ్ లోరేస్ అనే చిత్రాలు వచ్చాయి.
ఇక రిషి పాత్రలో నిఖిల్ బాగానే నటించాడు. పాత్రకు తగినవిధంగా బాడీని మార్చుకున్నాడు. డాన్స్ కూడా బాగానే చేశాు. కన్నడ చిత్రం సప్తసాగరాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఇందులో పర్వాలేదు అనిపించేలా వుంది. అమాయకత్వంతో పాత్రను మెప్పించింది. మోడ్రన్ అమ్మాయిగా దివ్యాంశ కౌశిక్ రెండు వేరియాక్షన్స్ లో నటించింది. డాన్ పాత్రలో బద్రి నారాయణగా జాన్ విజయ్ కామెడీ విలనిజాన్ని పండించేశాడు. మిత్రుడిగా మున్నా పాత్రలో అజయ్ ఎంటర్ టైన్ చేశారు. మరోవైపు కమెడియన్ సత్య, సుదర్శన్ లు పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు రాసుకున్న కథ.. కథనాలు వైవిధ్యంగా వున్నాయి. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను ఎంతో గ్రిప్పింగ్ గా నడిపించారు. లవ్ థ్రిల్లర్ కనుక సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. థ్రిల్లర్ మూవీస్ కి సరిపడా బీజీఎం ఇచ్చాడు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. సినిమా మొత్తం లండన్ షూట్ చేయడంతో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు
అయితే అక్కడక్కడా కొన్ని లోపాలను సరిదిద్దుకుంటే బాగుండేది. టైటిల్ కు తగినట్లు ఈ చిత్రాన్ని అప్పుడెప్పడో తీయడంతో నేటి ట్రెండ్ కు తగినట్లుగా అనిపించదు. ఇందులో ప్రధాన అంశం చిన్నదే. అందుకే చాలా సాదాసీదాగా వుండడంతోపాటు కొంచెం బోరింగ్ సన్నివేశాలు కనిపిస్తాయి. నిఖిల్ నుంచి ఆ మధ్య కాలంలోనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ఇచ్చిన హై మూమెంట్స్ ఈ సినిమాలో అయితే లేవని చెప్పొచ్చు. ఒక్క క్లైమాక్స్ పోర్షన్ బాగుందనిపిస్తుంది. దాంతో అంతకుముందు చెప్పే కథనం కాస్త నిదానంగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ లోపాలు సరిదిద్దుకుంటే సినిమా మరోలా వుండేది.