Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

దేవి
మంగళవారం, 2 డిశెంబరు 2025 (19:46 IST)
Sri Nandu, Varun Reddy, Yamini Bhaskar
హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు,  శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.
 
మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన  సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
 
శ్రీ నందు మాట్లాడుతూ,  నాకు రైటింగ్, డైరెక్షన్ మీద మొదటి నుంచే ఆసక్తి ఉంది.  కొన్ని మ్యూజిక్ వీడియోస్ కి డైరెక్షన్ చేశా. బ్రోచేవారు బ్యానర్లో నాకు డైరెక్టర్ గా ఒక సినిమా ఓకే అయింది. అప్పుడే ఒక రైటర్ కావాలంటే వరుణ్ పరిచయమయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది .ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఒక నమ్మకం వచ్చింది. నిజానికి ఈ సినిమా ఒక డెమో లాగా షూట్ చేశాడు. దాన్ని ఒక ఓటీటీ సంస్థ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇది మంచి స్కేల్లో ఇంకా చాలామందికి రీచ్ కావాల్సిన కథ అని చెప్పను. ఆ తర్వాత మేమే ఈ సినిమాని చేయాలనుకుని నిర్ణయించుకున్నాం. వరుణ్ నా నమ్మకాలు నిలబెట్టుకున్నాడు.
 
ఈ సినిమాకి మీలాంటి యువకుడి కథ అనే టాగ్లైన్ పెట్టాం. ఈ కథ కూడా ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలాగా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.  లెజెండ్రీ రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ సాయి రాజేష్ గారు, అనుదీప్  ఈ సినిమా చూసి చాలా అభినందించారు. సురేష్ బాబు గారు చూసి వెంటనే సైన్ చేశారు. నిర్మాతగా నేను ఫ్రాఫిట్ లో ఉన్నాను. ఈ సినిమాని తీసుకున్న సురేష్ బాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది  టేబుల్ ప్రాఫిట్ ఫిలిం. పెళ్లిచూపులు సినిమాలో సెకండ్ లీడ్ గా చేశాను. ఆ సినిమా సక్సెస్ సమయంలోనే నాకు ఇలాంటి ఒక రోజు రావాలని బలంగా కోరుకున్నాను. ఈరోజు సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని  తీసుకోవడం నా డ్రీమ్ నెరవేరినట్లుగా అనిపించింది.
 
ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ప్రతి పాత్రకి న్యాయం చేశాను. ఏ ఒక్కరోజు కూడా నా నటన గురించి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. ఆర్ సి బి లో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్లకి విజయం రావడానికి 18 ఏళ్లు పట్టింది. నా 18 ఏళ్ల జర్నీ అయింది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఈసారి విజయం మనదే. సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ కొందరికి నచ్చుతుంది. సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు క్షమాపణలు చెప్తాను. ఇది పొగరుగా చెప్పడం లేదు చాలా వినయంగా చెప్తున్నాను. ఒకవేళ ఫెయిల్ అయినా  ఇక్కడే ఉంటా సినిమాలు చేస్తాను. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇవ్వండి. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి.
 
ఈ సినిమా కోసం నేను 18 కిలోలు తగ్గాను. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా కనిపించడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. ఈ క్యారెక్టర్ పై అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ లేదు కానీ ఫిలిం మేకింగ్ పరంగా డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా గారి ప్రభావం ఉంది. ఆయన ఒక కొత్త ఫిలిం మేకింగ్ లాంగ్వేజ్ ని పరిచయం చేశారు. గ్రామర్ ఆఫ్ ఎడిటింగ్ ఫిలిం మేకింగ్ చాలా కొత్తగా ప్రయత్నించారు. ఈ సినిమా మొదలెట్టినప్పుడే రానా గారికి ఇలాంటి కంటెంట్ నచ్చుతుంది ఆయనకి తప్పకుండా చూపిద్దామని అనుకున్నాం. మేము అనుకున్నదిఈరోజు నిజమైంది. సెన్సార్ బోర్డు సభ్యులకి ఈ సినిమా చాలా నచ్చింది. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నా కెరీర్ కి ఇది బంగారు బాట లాంటి సినిమా అవుతుంది.  మీరందరూ నా జర్నీ చూస్తున్నారు. నేను ఈరోజు ఎమోషనల్ అయ్యాను. సినిమా చూసిన తర్వాత మీరు ఎమోషనల్ నన్ను హగ్ చేసుకునే రోజు డిసెంబర్ 12 అవుతుందని నేను నమ్ముతున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments