Nandu, Yamini, Varun Reddy
హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ సైక్ సిద్ధార్థ కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. హీరో హైపర్యాక్టివ్,. ప్రతి చిన్న పరిస్థితికి అనూహ్యయంగా స్పందించే యువకుడు. టీజర్ ప్రారంభంలో, అతను తన స్నేహితుడితో కలిసి వైల్డ్ కారు ప్రయాణంలో, చిన్న చిన్న విషయాలపై తన నిరాశను చెబుతుంటాడు. విజయం సాధించడంలో నమ్మకం కోల్పోయిన ఓడిపోయిన వ్యక్తిగా తనను తాను చెప్పుకుంటాడు. టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది.
ఈ టీజర్ హ్యాజ్ బజ్‌ను సృష్టిస్తుంది, డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది.
హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. నిర్మాతగా కూడా ఈ సినిమాతో మారాను. కథ ప్రకారం షేక్ పేటలోని ఓ ఇల్లు, సందుల్లోనే తీశాం. చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచి వారి ఫర్మిచర్ ను కూడా ఉచితంగా వాడుకున్నాం. బడ్జెట్ పరంగా పరిమితంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. కానీ, షేట్ పేట ఫ్లై ఓవర్ పై క్లయిమాక్స్ తీయాలనుకున్నాం. అందుకు పర్మిషన్ కావాలంటే 7 లక్షలు అవుతుందని చెప్పారు. అందుకే ఎర్లీ మార్నింగ్ ను షూట్ చేశాం. అందుకు ముందు పోలీస్ పికెట్ వ్యాన్ వున్న పోలీసులను కలసి చిన్న సినిమా ప్రజలకు ఇబ్బంది లేకుండా షూట్ చేస్తామని రిక్వెస్ట్ చేశాం. దాంతో వారు కూడా మా అభీష్టానికి సపోర్ట్ చేశారు. దాంతో మాకు పెట్రోల్ ఖర్చు 1500 మినహా ఖర్చుకాలేదని అన్నారు.
ఈ సినిమాలో ఫన్ ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. సురేష్ బాబు గారు. రానా గారి దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ గ్రామర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన రానా గారికి సురేష్ బాబు గారికి థాంక్యూ. సినిమాని అన్నీ నేచురల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. చాలా మంచి సినిమా చేశాం. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలో చూడని ఒక కొత్త కోణం కనిపిస్తుంది. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ .. చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. సురేష్ బాబు, రానా గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ టైటిల్ కథకి పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రమోషన్స్ లో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాము. నందు చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. ఈ సినిమాతో తనలోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు.
యామిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్ ఫిలిం. మా టీమ్ అందరు చాలా నమ్మకంతో చేశాం. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. షూటింగ్ చాలా ఫన్ గా అనిపించింది. ఆడియన్స్ కూడా అదే ఫన్ ఫీల్ అవుతారు.