Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అంటే ఇష్టమే కానీ... పవన్‌కు వంద ముద్దులు పెడతా : సురేఖావాణి

Webdunia
గురువారం, 13 మే 2021 (16:34 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు సురేఖావాణి. ఈమెకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవలి కాలంలో ఆమె కొంత నెమ్మదించినా... ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఆమె భర్త చనిపోవడంతో  అత్తింటి వేధింపులు భరించలేక తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. 
 
అదేసమయంలో బిడ్డకు తల్లి అయినప్పటికీ... గ్లామర్‌గా కనిపించడంలో కుర్రకారు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అపుడపుడూ షేర్ చేస్తోంది. ఆమె షేర్ చేసే ఫొటోలు వైరల్ అవుతుంటాయి. 
 
సినిమాలు కొంత తగ్గినా... సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటూ, అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సురేఖ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
 
మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద అభిమానినని... ఆయనను చూసిన ప్రతిసారి తన కళ్లలో నీళ్లొస్తాయని సురేఖ చెప్పింది. 'స్టాలిన్' షూటింగ్ సమయంలో ఆయనను చూసి ఏడుస్తుంటే ఓదార్చారని... అంతేకాదు, ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని తెలిపింది.
 
ఇక మన హీరోల్లో ముద్దు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడతారనే ప్రశ్నకు సమాధానంగా... పవన్ కల్యాణ్‌కు అయితే వంద ముద్దులైనా పెడతానని చెప్పింది. తన కూతురు సుప్రియకు నటన పట్ల ఆసక్తి ఉందని... ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటోందని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments