Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (15:27 IST)
పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ జంటగా నటించిన "అబీర్ గులాల్" చిత్రంపై కేంద్రం నిషేధం విధించింది. కాశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు ఈ నెల 22వ తేదీన దాడికి తెగబడి 25 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో దేశీయంగా పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. ఇందులోభాగంగా, వచ్చే నెల 9వ తేదీన అబీర్ గులాల్ విడుదలకానుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చిత్రంపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. దీంతో కేంద్రం కన్నెర్రజేసింది. ఈ సినిమా భారత్‌లో విడుదలకాకుండా నిషేధం విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
మరోవైపు, యూట్యూబ్ (ఇండియా)లో ఈ సినిమా పాటలను కూడా తొలగించారు. ఈ విషయంపై చిత్ర దర్శక నిర్మాతలు స్పందించలేదు. ఉగ్రదాడిపై స్పందించకుండా అదే రోజు సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటి వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ పోస్టును తొలగించింది. అలాగే, పాకిస్థాన్ నటులను ప్రోత్సహిస్తున్నారంటూ బాలీవుడ్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఆర్తి ఎస్ బగ్దీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

Google: భర్తను హత్య చేసి తప్పించుకోవడం ఎలా.. గూగుల్‌ను అడిగిన భార్య!

Mumbai monorail breakdown: ముంబై మోనోరైలులో చిక్కుకున్న 582 మంది సేఫ్

ఏపీలో స్త్రీ శక్తి పథకం.. త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments