Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్లవుతుందా? శ్రియ ప్రశ్న

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (14:09 IST)
ఆ క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్లవుతుందా లేకుంటే అమ్మాయిలకు పెళ్లి కాదా అని మూడు పదుల నటి శ్రీయ ప్రశ్నిస్తోంది. పైగా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో తాను నటించబోనని స్పష్టంచేసింది. ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తాను ఆది నుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలకు వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆ మధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని తెలిపింది. తొలుత ఆ కమర్షియల్ ప్రకటనలో నటించాలని తననే సంప్రదించారని, దాన్ని తాను తిరస్కరించానని చెప్పింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'సదరు క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్ళవుతుందా? లేకపోతే కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబంధించిన విషయం. అది స్వతహాగానే వస్తుంది తప్ప ఏ క్రీమ్‌లు వాడినా రాదు. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా నేను ఒప్పుకోను' అని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

నా ప్రేమ అంగీకరించవా? చూడు నిన్ను ఏం చేస్తానో అంటూ బాలిక మెడపై కత్తి పెట్టిన ఉన్మాది (video)

పరుపులోకి దూరిన కొండచిలువు - కుక్కల అరుపులతో మేల్కొన్న యువకుడు

'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ రాజీనామా వెనుక?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments