Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ క‌టౌట్‌- బేగంపేట నుంచి భారీ ర్యాలీ

Webdunia
బుధవారం, 20 జులై 2022 (15:39 IST)
Vijay Devarakonda Huge Cutout
తెలంగాణా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ క‌టౌట్ తొలిసారిగా హైద‌రాబాద్‌లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్‌లోని మెయిన్ థియేట‌ర్ సుదర్శన్ 35ఎంఎం థియేటర్ దగ్గర పెట్టారు. ఇది  75 అడుగుల మాసివ్ కటౌట్. కాగా, ఈ క‌టౌట్‌ను అభిమానులు ఆశ్చ‌ర్యంగానూ మెచ్చుకోలుగా చూస్తుంటే, ప‌లువురు ఇది డ్రాయ‌ర్ యాడ్‌లా వుంద‌ని పేర్కొంటున్నారు. ర‌క‌ర‌కాలుగా దీనిపై సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ న‌గ్నంగా వున్న స్టిల్ విడుద‌ల‌చేయ‌గా అదీ పెద్ద ర‌చ్చ‌గా మారింది.
 
విజ‌య్ చేస్తున్న తాజా సినిమా లైగ‌ర్‌. దర్శకుడు పూరి జగన్నాథ్  ఒక మాసివ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.  ఇప్పుడు అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ ట్రైలర్ లాంచ్ కి గాను గ్రాండ్ గా మేకర్స్ పనులు సిద్ధం చేస్తున్నారు.
 
- ఈరోజు రాత్రికి విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న టీమ్‌తో హైద‌రాబాద్‌లోని పాత ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. అక్క‌డ‌నుంచి ఆయ‌న్ను ఘ‌నంగాస్వాగ‌తం ప‌లికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు విజ‌య్ అభిమానులు త‌ర‌లివ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఛార్మి లు నిర్మాణం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న  విడుద‌ల చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరే... పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదు... పవన్ మంచోడు కాబట్టే.. : జేసీ ప్రభాకర్ రెడ్డి (Video)

తూగోలో రేవ్ కలకలం... ఐదుగురు అమ్మాయిలతో 14 మంది పురుషుల పార్టీ!!

Hyderabad: ప్రేమలో మునిగి తేలుతున్నారు.. వాటిని ఆర్డర్ చేశారు..

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments