Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యభారతి మరణానికి ముందు ఎవరిని కలిసిందో తెలుసా...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:10 IST)
చిన్న వయస్సులోనే గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి దివ్య భారతి. అతి తక్కువ కాలంలోనే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. మూడు భాషలలో అగ్రహీరోల సరసన నటించింది. అలాంటి నటి దురదృష్టవశాత్తు అతిపిన్న వయస్సులోనే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన ఆమె జన్మదినం సందర్భంగా జాతీయ మీడియాలో ఆమెపై ప్రచురితమైన కథనం ఆసక్తికరంగా ఉంది.
 
ఆ కథనం మేరకు... చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకుని, ముంబై వెళ్లి అక్కడ చేయాల్సి ఉన్న మరో షూటింగ్‌ను రద్దు చేసుకుని తన ఇంటికి వెళ్లింది. డిజైనర్ నీతా లుల్లా నుండి ఫోన్ కాల్ రావడంతో 'ఆందోళన్' సినిమా కోసం తన దుస్తుల డిజైనింగ్ గురించి మాట్లాడటానికి ఆమెను ఇంటికి ఆహ్వానించగా, తన భర్తతో కలిసి వచ్చిందని కథనంలో పేర్కొన్నారు. 
 
నీతా, ఆమె భర్త, దివ్యభారతి కలిసి మందు కొడుతుండగా, పనిమనిషి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ సమయంలో నీతా దంపతులు టీవీ చూస్తుండగా, దివ్య బాల్కనీ పిట్టగోడ చివరన కూర్చుంది. అక్కడ పట్టుతప్పి ఐదు అంతస్తులపై నుండి కింద పడిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్‌కు తీస్తుని వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
 
దివ్యభారతి మరణంపై అనేక అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. దివ్యభారతి తండ్రి ఓం భారతి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఇంకా దివ్యభారతి డిప్రెషన్‌కు లోనుకాలేదని, ఎలాంటి సమస్యనైనా కూల్‌గా పరిష్కరించుకునే సామర్థ్యం తనకుందని, ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. తన మరణం ఎప్పటికీ తీరని లోటు అని బాధపడ్డారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments