Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

200 అడుగుల బోరుబావిలో ఇరుక్కున్న ఆరేళ్ళ బాలుడు...16 గంటల తర్వాత....

200 అడుగుల బోరుబావిలో ఇరుక్కున్న ఆరేళ్ళ బాలుడు...16 గంటల తర్వాత....
, గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:02 IST)
పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 16 గంటల పాటు పడిన శ్రమ సలీకృతమైంది. గంటల కొద్ది నిరీక్షణ ఫలించింది. మహారాష్ట్రలో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడిని మృత్యుంజయుడుగా రక్షించారు. ప్రమాదవశాత్తు 200 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
నిజానికి కొంత మంది వ్యక్తుల అజాగ్రత్త వల్ల పిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. పిల్లలకు చిన్న వయస్సులో పెద్దవాళ్ల లాగా అలోచించే శక్తి ఉండదు. తెలిసో తెలియకో ప్రమాదాలబారిన పడుతుంటారు. ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాల్సి ఉంది. బోరు బావి వేయించిన వ్యక్తులకు దానిని కప్పి ఉంచాలనే కనీస జ్ఞానం కూడా లేకపోవడంతో, ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కాలు జారి బోరు బావిలో పడిపోయాడు. 
 
మహారాష్ట్రలోని పూణే నగర సమీపంలోని అంబగామ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందడంటో పోలీసులు, జాతీయ విపత్తు సహాయ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. సిబ్బంది సహాయంతో బావి పక్కన సమాంతరంగా గుంట తవ్వించారు. బాలుడు 10 అడుగుల లోతు వరకు మాత్రమే వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 10 అడుగుల గుంట లోడి బాలుడిని రక్షించారు. తక్షణమే బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సహాయపడిన పోలీసులకు, జాతీయ విపత్తు సహాయ శాఖకు కుటుంబ సభ్యులు, స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దిరిపోయే ప్లాన్‌తో జియోను దెబ్బతీసేందుకు సిద్ధమైన బీఎస్ఎన్ఎల్