జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ దెబ్బను తట్టుకుని నిలబడ్డ కొన్ని సంస్థలు జియోను అధిగమించడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది.
బిఎస్‌ఎన్ఎల్ ఇప్పటికే అందిస్తున్న రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో తాజాగా మార్పులు చేసింది. ఈ ప్లాన్ క్రింద వినియోగదారులు ఇప్పటి వరకు అపరిమిత లోకల్ మరియు ఎస్‌టీడీ కాల్‌లతో పాటు ప్రతిరోజూ 1 జీబీ డేటాను పొందుతుండగా ఇక నుండి రూ. 349తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అపరిమిత కాల్‌లతో పాటుగా 3.2 జీబీ డేటాను అందించనుంది.
దీని వ్యాలిడిటీ 64 రోజులుగా ఉంటుంది. అంతే కాకుండా డేటా స్పీడ్‌ను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ ఆఫర్ ఢిల్లీ, ముంబై సర్కిల్స్ మినహా అన్ని ప్రాంతాల వినియోగదారులకు వర్తిస్తుంది.
కాగా ఇదే మొత్తానికి జియో 1.5 జీబీ డేటాను అందిస్తుండగా బిఎస్‌ఎన్ఎల్ దానికి రెట్టింపు కంటే ఎక్కువగా 3.2 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఇలాగే కొనసాగితే జియో కూడా నష్టాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.