Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

140 కిమీ వేగంతో లారీపైకి దూసుకెళ్లిన కారు.. నాగార్జున మృతి

Advertiesment
140 కిమీ వేగంతో లారీపైకి దూసుకెళ్లిన కారు.. నాగార్జున మృతి
, గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:55 IST)
విజయవాడ కృష్ణలంక హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు.. కృష్ణలంకకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన నాగార్జున, హరీశ్, ప్రియాంకతో పాటు మరో యువకుడు ఉన్నాడు. వీరిలో నాగార్జున అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లుడు మోజులో భర్తను చంపిన భార్య... కాబోయే ఎస్.ఐ జైలుపాలైంది