Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తి కోసం భర్తపై సలసలకాగుతున్న నీళ్లు పోసిన ఇల్లాలు

Advertiesment
ఆస్తి కోసం భర్తపై సలసలకాగుతున్న నీళ్లు పోసిన ఇల్లాలు
, బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:58 IST)
ఇటీవలి కాలంలో పలువురు మహిళలు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కట్టుకన్న భర్త కంటే ప్రియుడే ముఖ్యమని భావిస్తున్నారు. ఫలితంగా భర్తలను హత్య చేయిస్తున్నారు. అలాగే, చిన్నపాటి గొడవలకే భర్తల నుంచి దూరమవుతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ఓ మహిళ ఆస్తి కోసం భర్తపై సలసలకాగుతున్న వేడి నీళ్లను పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ అయోధ్య నగర్‌లోని అయోధ్య టవర్స్‌లో అట్లూరి వెంకటరమణ, హేమలత అనే దంపతులు నివశిస్తున్నారు. వీరికి 18 యేళ్ళ క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెంకటరమణ భవన నిర్మాణ పనులు చేస్తుంటే. హేమలత మాత్రం స్థానిక నగర పాలక సంస్థ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. 
 
ఈ క్రమంలో కుటుంబ బాధ్యతలను వెంకటరమణ సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించిన హేమలతం.. భర్త పేరుపై ఉండే ఆస్తులను తన, పిల్లల పేరిట రాయాలని డిమాండ్ చేస్తూ చేస్తోంది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు వెంకటరమణ పొయ్యిపై నీళ్లు పెట్టుకున్నారు. అవి సలసల కాగుతుండగా ఓ గిన్నెతో నీటిని తెచ్చిన హేమలత వెంకటరమణపై పోసింది. దీంతో అతని వీపుపై తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్ జీ.. పుల్వామా ఉగ్రదాడి మా పనే : జైషే మహమ్మద్