నరేంద్ర మోడీ బయోపిక్ : హీరాబెన్‌ పాత్రలో ప్రముఖ నటి

ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (12:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ చిత్రం నిర్మితం కానుంది. ఒమంగ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పేరు 'పీఎం నరేంద్ర మోడీ'. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొత్తం 23 భాషల్లో చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రంలోని పాత్ర‌ల‌కి సంబంధించిన లుక్స్ విడుద‌ల చేస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు మేక‌ర్స్. 
 
ఇటీవ‌ల భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్‌ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆయన పాత్రలో టీవీ న‌టుడు మనోజ్ ‌జోషి నటిస్తున్నారు. ఇక తాజాగా మోడీ తల్లి హీరాబెన్‌ మోడీ, భార్య జశోదాబెన్ పాత్ర‌లో న‌టిస్తున్న వారి లుక్స్ విడుద‌ల చేశారు. హీరాబెన్‌ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్ న‌టిస్తుండ‌గా, జశోదాబెన్‌ పాత్రలో బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా నటిస్తున్నారు. 
 
ఇద్దరి పాత్ర‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇక మోడీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సీనియ‌ర్ న‌టులు కూడా చిత్రంలో ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యేడాది ద్వితీయార్థంలో పీఎం నరేంద్ర మోడీ బ‌యోపిక్ విడుద‌ల కానుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'మన్మథుడు' సరసన 'దేవయాని'