ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ వినియోగదారులకు కొత్త ఆఫర్లు ప్రకటించింది. కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని వినియోగదారుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది. ఇందులో వర్షికా-1699 ప్లాన్ వినియోగదారులను ఆకట్టుకునేలా వుంది. ఈ ప్లాన్ ప్రకారం రూ.1.699 చెల్లించి ఏడాదిపాటు అపరిమిత (లోకల్ అండ్ రోమింగ్) వాయిస్‌కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, ఉచిత కాలర్‌ట్యూన్, అపరిమిత డేటా పొందవచ్చు.
కానీ డేటా వినియోగదారులు ఒకరోజులో 2జీబీ డేటా ఉపయోగించాక వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిస్తారు. ఇవే ఆఫర్లు వర్షికా ప్లస్-2099 ప్లాన్‌కూ వర్తిస్తాయి. రూ.2,099తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 4జీబీ వినియోగించాక డేటా వేగం 80 కేబీపీఎస్‌కు కుదిస్తారు.
అలాగే రూ.300 టాప్ అప్‌తో రూ.30, గురు, శుక్ర, శనివారాల్లో రూ.250, సోమ, మంగళ, బుధవారాల్లో రూ.500, రూ.600 టాప్‌అప్ చేయించుకుంటే పదిశాతం అదనంగా టాక్‌టైం లభిస్తుంది. ఇదే తరహాలో పలు ఆకర్షణీయమైన ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రకటించింది.