Publish Date: Mon, 26 Nov 2018 (09:27 IST)
Updated Date: Mon, 26 Nov 2018 (09:28 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ.. రెవెన్యూలోనూ అగ్రస్థానంలో నిలిచింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికాం రంగంలోని సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) విషయంలో రూ.8.271 కోట్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచిందని ట్రాయ్ వెల్లడించింది.
ట్రాయ్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. వొడాఫోన్-ఐడియా రూ. 7,528 కోట్ల రాబడితో రెండో స్థానంలో వుండగా.. ఇందులో వొడాఫోన్ ఏజీఆర్ రూ.4,483 కోట్లు రాగా, ఐడియా రూ.3,743.1 కోట్లను రాబట్టింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.6,720 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
అలాగే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం స్సత బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా రూ.1,284 కోట్లుగా తేలింది. గత త్రైమాసికంలో జియో ఏజీఆర్ విలువ రూ.7,125.5 కోట్లు కాగా.. వొడాఫోన్ ఐడియా కలిసినప్పుడు ఏజీఆర్‌ల విలువ రూ.8.226.79 కోట్లు కావడం గమనార్హం.
webdunia
Publish Date: Mon, 26 Nov 2018 (09:27 IST)
Updated Date: Mon, 26 Nov 2018 (09:28 IST)