Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ల వల్లే మహిళలు భర్త, పిల్లల్ని వదిలేస్తున్నారు.. అత్యాచారాలు కూడా?: భాగ్యరాజా

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (12:25 IST)
స్మార్ట్ ఫోన్లు లేకుండా పొద్దుగడవదు చాలామందికి. పురుషులైనా, మహిళలైనా స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తున్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా కొందరు స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఏదీ పట్టించుకోరు. 24 గంటలూ స్మార్ట్ ఫోన్లతో కాలం వెచ్చించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకం వల్లే మహిళలు పాడైపోతున్నారని తమిళంలో విభిన్న కథా చిత్రాల నటుడిగా, దర్శకుడిగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్న భాగ్యరాజా వ్యాఖ్యానించారు. 
 
తాజాగా భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమైనాయి. ఓ సినిమా కార్యక్రమంలో భాగ్యరాజా మాట్లాడుతూ..  ముఖ్యంగా సెల్ ఫోన్స్ కారణంగా ఆడవాళ్లు చెడిపోతున్నారు. వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని ఒదిలేస్తున్నారన్నారని కామెంట్స్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. 
 
అంతేకాదు మహిళల అజాగ్రత్త వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా పొలాచ్చిలో జరిగిన అత్యాచార ఘటనలో మగవాళ్లది అసలు తప్పే లేదన్నారు. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టి అత్యాచారం జరిగిందన్నారు. మరోవైపు ఇపుడున్న ఆడవాళ్లు చాలా మంది కట్టుబాట్టను ఒదిలేస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
అలాంటి వాళ్ల వల్లే ఇన్ని అనర్థాలు వచ్చిపడ్డాయన్నారు. ఇంకోవైపు  ఆడవాళ్లు కట్టుబాట్ల గురించి మాట్లాడిన భాగ్యరాజా పురుషులు ఎన్ని సంబంధాలు పెట్టుకున్న ఏమి కాదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భాగ్యరాజా వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా మహిళ సంఘాలు భాగ్యరాజా తీరుపై మండిపడుతున్నాయి. వెంటనే ఆయన మహిల సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవ్యాంధ్రలోని మూడు పట్టణాల్లో లులు మాల్స్

బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు..

Lulu Malls: తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలలో లులు మాల్స్ ఏర్పాటు

Teenage NRI: 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల.. ఏడు సెకన్లలోపు గుండె జబ్బుల్ని గుర్తించే..? (video)

Araku Coffee Stall: పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments