Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో నాని జెర్సీ.. కలెక్షన్లు కుమ్మేస్తుందా?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:57 IST)
ఇండియాలో ఓ మోస్తరుగా ఆడినా, చైనాలో విడుదలై భారీ రాబడులను తెచ్చిపెట్టిన సినిమాలు ఉన్నాయి. సీక్రెట్ సూపర్ స్టార్ అనే చిన్న హిందీ సినిమా ఇండియాలో పెద్దగా ఆడలేదు. కానీ చైనాలో ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం బడ్జెట్ రూ.50 కోట్లు లోపే. దాని తర్వాత మరో చిత్రం ‘హిందీ మీడియం’ సైతం చైనాలో అనూహ్యంగా ఆడి వందల కోట్లు కొల్లగొట్టడం విశేషం. 
 
మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సరిగ్గా ప్రమోట్ చేసుకుంటే చైనాలో మన సినిమాలకు మంచి డిమాండే ఉంది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అక్కడి మార్కెట్‌ని విశ్లేషించే ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రాంతీయ భాషల సినిమాలు మాత్రం చైనా మార్కెట్‌పై దృష్టిపెట్టడం లేదు. 'బాహుబలి'తో తెలుగు నుండి చైనా మార్కెట్‌ని కొల్లగొడదామనుకున్నా సాధ్యపడలేదు. 
 
రెండు భాగాల్ని అక్కడ భారీగానే రిలీజ్ చేసారు. కానీ ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. వసూళ్లు ఊహించిన స్థాయిలో రాలేదు. వచ్చింది మొత్తం రీలీజ్ ఖర్చులకే అయిపోయింది. బాహుబలి వలనే కానిది మిగతా వాటి వల్ల ఎలా అవుతుందని మిగతా వారు సాహసించడం మానేశారు. ఐతే నానీ నటించిన జెర్సీ సినిమాని చైనాలో కూడా విడుదల చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. 
 
ఈ విషయాన్ని ఇటీవల సూర్యదేవర నాగవంశి కూడా ధృవీకరించారు. ఇండియా సినిమాల్లో భారీతనం ఉట్టిపడే వాటి కంటే ఎమోషనల్‌గా టచ్ చేసే సినిమాలకే చైనాలో ప్రాధాన్యత లభిస్తోంది. సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, భజరంగి భాయిజాన్ లాంటి సినిమాలు ఇలాగే విజయం సాధించాయి. మరి జెర్సీ కూడా అక్కడ విజయ పథం వేస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.11,000 కోట్లు - హడ్కో ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments