Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయ్ నాన్నాతో ప్రేమలో పడిపోతారు లేదంటే నా పేరు మార్చుకుంటా : హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (12:56 IST)
Mrinal Thakur, nani, priyadasi and others
కథానాయకుడు నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'.  వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో ‘హాయ్ నాన్న’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా  నిర్వహించింది.
 
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, వైజాగ్ తో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. డిసెంబర్ 7న వైజాగ్ లో ప్రతి మూలనుంచి అందరూ థియేటర్స్ కి వెళ్లి హాయ్ నాన్న చూడాలి. డిసెంబర్ నెల కొత్త సంక్రాంతి అని నా ఫీలింగ్. తెలియకుండా ఇది సినిమా పండగ నెల అయిపొయింది. ఇకపై డిసెంబర్, జనవరి రెండు నెలలు సినిమాలకి సెలబ్రేట్ చేసుకోవాలి. డిసెంబర్ 1న మన తెలుగు దర్శకుడు హిందీకి వెళ్లి యానిమల్ సినిమా వస్తోంది, 8న నా స్నేహితుడు నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తో వస్తున్నారు, 22న మనమందరం ఎదురుచూస్తున్న ప్రభాస్ అన్న సలార్ వస్తోంది, అలాగే నాకు ఇష్టమైన దర్శకుడు రాజుహిరణీ గారి డంకీ సినిమా 21 వస్తోంది, 29న సుమగారబ్బాయి బబుల్గమ్ సినిమా విడుదలౌతుంది. సినిమాలన్నీ కూడా గొప్ప బ్లాక్ బస్టర్ అయిపోయి ఇకపై డిసెంబర్, జనవరి నెలలు సినిమా పండగ నెలలుగా డిక్లేర్ చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఇన్ని సినిమాలు వున్నాసరే డిసెంబర్ 7న వస్తున్న ‘హాయ్ నాన్న’ ఎప్పటికీ మీ మనసులో నిలిచిపోతుందని పూర్తి నమ్మకంతో చెబుతున్నాను. విరాజ్, మహి, యష్ణ, జస్టిన్ ఈ టీం అందరూ కూడా మీ మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటారు. ‘హాయ్ నాన్న’ హాయిగా ఉండబోయే సినిమా. నాని ఏడిపించేస్తాడు ఇదొక ఎమోషనల్ ఫిల్మ్ అనుకుంటున్నారు కదా.. కాదు.. మీ కళ్ళల్లో నీళ్ళు కూడా ఆనందంగా తిరుగుతాయి. ఆనందభాష్పాలు తెప్పించే సినిమా ఇది. థియేటర్ కి వెళ్లి ఎలాంటి ఎడ్రినాలిన్ ఫీలవ్వల్లో అలాంటి ఎడ్రినాలిన్ మొదటి నుంచి చివరి వరకూ ఒక ప్రేమకథలో కుదిరితే ఎలా వుంటుందో అది హాయ్ నాన్నలో చూస్తారు. దర్శకుడు శౌర్యువ్ మొదటి సినిమా ఇది. ఇంత గొప్ప అవుట్ ఇచ్చిన శౌర్యని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత తను మరింత గొప్ప స్థాయికి వెళ్తారనే నమ్మకం వుంది. మా నిర్మాతలు మోహన్, విజయేందర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి ప్రొడక్షన్ లో చేసే మొదటి సినిమా చాలా గొప్ప సినిమా అవ్వాలని బలంగా కోరుకుని ఈ ప్రాజెక్ట్ ని చేశాను. ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు ఇంకా గర్వంగా ఫీలౌతున్నా.

హేషమ్ వహాబ్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. షాన్ జాన్ వర్గీస్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు.  మా ఎడిటర్ ఇంత గొప్ప కావ్యాన్ని అన్ని హైస్ తో రెండున్నర గంటల్లో అద్భుతంగా నెరేట్ చేయగలిగారు. మా ఆర్ట్ డైరెక్టర్ అవినాస్ కి, మా టీం అందరినీ పేరుపేరున ధన్యవాదాలు. మనందరం తలఎత్తుకొని చాలా గర్వంగా చెప్పగలిగే సినిమా చేశాం. ప్రియదర్శి హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటించారు. మనసుని హత్తుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విరాజ్, జయరామ్ గారు కూడా చాలా చక్కని పాత్రల్లో నటించారు. బేబీ కియరా నటన మీ అందరిని అలరిస్తుంది. అలాగే శ్రుతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. మీరంతా ఆ పాటని చాలా ఎంజాయ్ చేస్తారు. వీటితో పాటు బోలెడన్ని సర్ప్రైజ్ లు సినిమాలో వున్నాయి. డిసెంబర్ 7న సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు. డిసెంబర్ 7.. థియేటర్స్ లో కలుద్దాం. హాయ్ నాన్న వెరీ వెరీ మెమరబుల్ ఫిల్మ్. ప్రామిస్’’ అన్నారు  
 
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామంకు ఇక్కడి వచ్చాను, ఇప్పుడు హాయ్ నాన్న కోసం ఇక్కడికి రావడం ఆనందంగా వుంది. సీత పాత్రని చాలా గొప్పగా ఆదరించారు. ఇప్పుడు హాయ్ నాన్నలో యష్ణ కు కూడా అదే అభిమానం చుపిస్తున్నారు. తెలుగు అమ్మాయిలా నన్ను ఆదరిస్తున్న మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో వుంటాను.  ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. హాయ్ నాన్న బ్యూటీఫుల్ జర్నీ. దర్శకుడు శౌర్యువ్  హాయ్ నాన్నని అద్భుతంగా మలిచారు. బేబీ కీయరా నటన మనసుని హత్తుకుంటుంది.

నాని గారు వండర్ ఫుల్ కో స్టార్. ఈ పాత్ర చేస్తునప్పుడు చాలా విలువైన సూచనలు ఇచ్చారు. చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. దర్శి, విరాజ్ ఇలా టీం అందరితో షూటింగ్ చాలా సరదాగా జరిగింది. హేషమ్ వహాబ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సమయమా, అమ్మాడి పాటలు నా ఫేవరేట్. ఇందులో తండ్రికూతురు అనుబంధం అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా చూస్తునపుడు వారితో ప్రేమలో పడిపోతారు. అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటా. డిసెంబర్ 7న తప్పకుండా అందరూ హాయ్ నాన్న చూడండి’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments