Ajay Bhupathi, Payal Rajput
మనకు కావాల్సిన వారు పక్కనుంటే చెప్పలేని ప్రేమ పుట్టుకు వస్తుంది. అందులో ప్రేమికుల సంగతి తెలిసిందే. ఇక కావాల్సిన అమ్మాయి వెతుకుంటే వస్తే ఆ మనిషిలో ఆనందం చెప్పలేనిది. ఇలాంటి పరిస్థితి దర్శకుడు అజయ్ భూపతికి కలిగింది. ఆర్.x 100 సినిమాలో పాయల్ రాజపుత్ ను రొమాన్స్ బాగా చూపించాడు. ఆ సినిమాకు పేరు బాగావచ్చింది. అందుకే ఆయన సినిమా చేస్తే కొట్లాడి మరి ఎంపికయ్యేలా చేసుకుంటుంది. ఈ విషయం పాయల్ స్వయంగా ఇటీవలే చెప్పింది. ఇక అజయ్ భూపతి అంతకంటే ఆనందం చెప్పాలా..
ఇటీవలే మంగళవారం సినిమా పాయల్ చేసింది. ఇందులో సెక్స్ కోరికలు తట్టుకోలేని పాత్ర. కనిపించిన వాడిని పొందే నైజం. ఆ పాత్ర కోసం చాలా మందిని దర్శకుడు ఆడిషన్ చేసాడు. ఇదే తెలిసి పాయల్ దర్శకుడుని చనువుతో నిలదీసిందట. వెంటనే ఆమెను ఎంపికచేశారు. ఈ విషయాన్నీ పాయల్ ప్రేమికుడిగా నటించిన ప్రియదర్శి తన మాటల్లో ఇలా చెప్పాడు.
నా పాత్రలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. అజయ్ అన్న కథ చెబుతున్నప్పుడు పులి క్యారెక్టర్ నేనే చేస్తున్నానేమో అనుకున్నా. నాకు ఆ క్యారెక్టర్ అంత నచ్చింది. కథలోకి వెళ్లిన తర్వాత ఫోటోగ్రాఫర్ వాసు క్యారెక్టర్ బాగా నచ్చింది. అది చేయాలని అనిపించింది. కానీ, అజయ్ అన్న మాలచ్చమ్మ చేయాలని అడిగారు. ఆ పేరు వినగానే నచ్చింది.
ఇక పాయల్ కంటే ముందు ఎంత మందిని ఆడిషన్స్ చేశారో నాకు తెలుసు. ఆవిడ వచ్చిన తర్వాత అజయ్ భూపతిలో నవ్వు కనిపించింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అద్భుతంగా పని చేశారు అని అన్నారు.