Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళవారం మూవీ పాయల్ రాజ్ పుత్ కు కరెక్ట్ సినిమానా.. రివ్యూ!

Payal-Ajmal
, శుక్రవారం, 17 నవంబరు 2023 (07:33 IST)
Payal-Ajmal
నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్, తదితరులు
సాంకేతికత.. సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర, మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, బ్యానర్: A క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్
రిలీజ్ డేట్: 2023-11-17
 
కథ..
గోదావరి జిల్లాలోని మా లక్ష్మీపురం అనే గ్రామస్తుల కథ. అక్కడ ఊరి గోడలపై అక్రమ సంబంధాలు పెట్టుకొన్న జంటల పేర్లు రాసి వుండడం, వారు చనిపోవడం జరుగుతుంటుంది. ఇలా ప్రతీ మంగళవారం మరణించడం ఆ ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అయితే గ్రామంలో మహాలక్షమ్మ అమ్మవారి జాతర చేయకపోవడమే ఈ అరిష్టాలకుకారనమని గ్రామస్థులు భావిస్తారు. అందుకు జాతర ఏర్పాట్లు చేయడానికి నాస్తికుడైన ఊరి జమిందారికి ఇష్టం వుండదు. ఆయన భార్య పూజారికి డబ్బులు ఇచ్చి జాతర ఏర్పాట్లు చేయమని చెబుతుంది.

అయినా గోడలమీద రాతలు ఆగవు. దాంతో ఊరి జనం రాత్రి పూట కాపుగాచి ఎవరు రాస్తున్నారు, ఎవరు చంపుతున్నారనే విషయాన్ని ఛేదించాలని చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి ఎస్ఐ (నందిత శ్వేత)గా వచ్చిన మరణాల వెనుక ఏదో మర్మం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపడుతుంది. అందులో కొన్ని విషయాలు తెలుస్తాయి? అవి ఏమిటి? మంగళవారమే మరణాలు ఎందుకు సంభవించాయి?  అనే ప్రశ్నలకు జవాబు మంగళవారం సినిమా కథ.
 
సమీక్ష.
ఈ కథ శైలు (పాయల్ రాజ్ పుత్) చిన్నతనం నుంచి ప్రారంభం అవుతుంది. తల్లిలేని పిల్లను అమ్మమ్మ దగ్గర వదిలేసిన తండ్రి మరో పెళ్లి చేసుకుని శైలు సాకాలంటే ఆమె పేరున్న మూడెకరాలు ఇవ్వాలని పట్టుబడతాడు. ససేమిరా.. అన్న అమ్మమ్మ దగ్గరే శైలు పెరుగుతుంది. చిన్న తనంలో ఓ ఫ్రెండ్ తో సరదాగా గడుపుతుంది. అలాంటి శైలుకు చేదు అనుభవం ఎదురవుతుంది. వున్న ఆస్తి మూడెకరాలు తీసుకుని తండ్రి వెళ్ళిపోతాడు. అమ్మమ్మ చనిపోతుంది. ఒంటరిగా బతికుతున్న శైలు జీవితంలో జరిగే కథే ఈ మంగళవారం.
 
ఇందులో మహిళల్లో కోరికలు ఎక్కువగా వుండే సెక్సువల్ డిజార్డర్‌ పాయింట్ ను దర్శకుడు టచ్ చేశాడు. ఇలాంటివి హై సొసైటీ మహిళలకు వుంటే ఆ కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది. అలాంటిది ఊరిలోని ఒంటరి మహిళకు వుంటే ఊరి జనాలు ఏవిధంగా ట్రీట్ చేస్తారు అనేపాయింట్ తో పూర్తి సెక్యువల్ కథగా తీశాడు.
 
- జాతర నేపథ్యంలో కాంతార తరహాలో కనిపించే మాస్క్ మనిషి, రెండు చేతులతో కాగడాలు పట్టుకుని ఊరి వారిని భయకంపితుల్ని చేసిన సన్నివేశాలు కేవలం ఆడియన్ ను డైవర్ట్ చేయడానికి మాత్రమే పెట్టినట్లు కనిపిస్తుంది.
- చిన్న తనంలో చిన్న కుక్క పిల్లను కాపాడిన శైలుకు అది పెరిగి పెద్దదయినా శైలును కాపాడలేని విధంగా చూపించాడు.
 
- పైగా ఇప్పటి జమిందార్ నాన్న, తాత కాలంలోనూ ఇలా హత్యలు జరిగాయని ఓ సన్నివేశంలో  ఊరి జనాలతో దర్శకుడు చెప్పిస్తాడు. కానీ కథలెో ఏదో విషయం వుందని చెప్పాడే మినహా అప్పటికి ఇప్పటికి సంబంధంలేని డైలాగ్ లు అని అర్థమవుతుంది.
- అయితే ఇందులో ఓ సందేశం ఇమిడి వుంది. తల్లి తండ్రులు లేని పిల్లలు అందులో మహిళ ఎలా సమాాజంలో మోసం పోతుందనే పాయింట్ చెప్పాడు. ఆ కోణంలో అక్రమ సంబంధం అనే పాయింట్ చూపించాడు.
 
- ఫస్టాఫ్‌లో జరిగే మరణాలు, వాటి చుట్టు సాగిన డ్రామాను డైరెక్టర్ రక్తి కట్టించారు. ప్రతీ క్యారెక్టర్‌పై అనుమానాలు వచ్చేగా రాసుకొన్నా సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచారు.
 
- మంగళవారం కథలో ప్రతీ ఎపిసోడ్‌తో ట్విస్ట్ ఇస్తూ ప్రతీ సీన్‌ను ఎమోషనల్‌గా మార్చారు. ఇద్దరు ముగ్గురు మినహా అంతా కొత్తవారితో దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. దర్శకుడే ఈ కథకు హైలైట్.
 
- RX100 తర్వాత పట్టుబట్టి మరీ ఈ పాత్రను నేనే చేయాలని చేసింది పాయల్. లాక్ డౌన్ టైంలో అనుకోని అతిథి అనే వెబ్ సిరీస్ చేసింది. అందులోనూ కోరికతో రగిలిపోయే పాత్ర ఆమెది. మంగళవారంలోనూ ఇంచుమించు అదే పాత్ర. కాకపోతే అంతకు మించి అన్నట్లుగా చూపించాడు దర్శకుడు. ఇలాంటివి పిల్లలతో కలసి చూడడం కొంచెం కష్టమనే చెప్పాలి.
 
-పాత్రలపరంగా నందిత శ్వేత, చైతన్య కృష్ణ, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమర్ పాత్రలు అన్నీ బలమైన పాత్రలే కావడంతో వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు రాణించారు. అజ్మల్ అమర్ అతిథి పాత్రకే పరిమితమయ్యారు.
 
- సాంకేతికంగా అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాను ప్లస్ అని చెప్పవచ్చు. డైలాగ్ లు సాధారణంగానే వున్నాయి. అయితే హైపర్ సెక్స్ డిజార్డర్అ నే మానసిక, లైంగిక రుగ్మత ఆధారంగా రూరల్, రస్టిక్ డ్రామా తీసినా లాజిక్ కు అందని లోపాలున్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఓ థ్రిల్లర్ సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
రేటింగ్.. 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సముద్రం చెంత.. చల్లని వెన్నెలలో జాన్వీ-ఎన్టీఆర్?