Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు.. పిచ్చి వేషాలు వేయొద్దు : మెహ్రీన్ వార్నింగ్

తన అభిమానులకు హీరోయిన్ మెహ్రీన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూనే సుతిమెత్తగా హెచ్చరించింది. రీసెంట్‌గా ఓ యువ‌కుడు మెహ్రీన్‌పై ఉన్న అభిమానంతో త‌న మెడ‌పై మెహ‌రీన్ పేరుని ప‌చ్చ‌బొ

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (16:48 IST)
తన అభిమానులకు హీరోయిన్ మెహ్రీన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూనే సుతిమెత్తగా హెచ్చరించింది. రీసెంట్‌గా ఓ యువ‌కుడు మెహ్రీన్‌పై ఉన్న అభిమానంతో త‌న మెడ‌పై మెహ‌రీన్ పేరుని ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. 
 
ఇది చూసిన మెహ‌రీన్ త‌న అభిమానుల‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు, కానీ ఇలా మిమ్మల్ని మీరు బాధించుకోకండి. మీ అందర్నీ ఎంతో అభిమానిస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు మెహ్రీన్. 
 
కాగా, హీరో నాని న‌టించిన 'కృష్ణ గాడి వీరప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంది. ఈ మధ్య 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. 
 
తాజాగా హీరో గోపిచంద్ సరసన 'పంతం' అనే సినిమా చేస్తుంది. ఇదేకాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న 'నోటా' చిత్రంలోనూ న‌టిస్తుంది. వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)మూవీలో వరుణ్ తేజ్ పక్కన జోడిగా మెహ్రీన్‌ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న ఈ అమ్మడుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగింది. అదేసమయంలో అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే పిచ్చి వేషాలను కూడా నిశితంగా గమనిస్తూ ఇలా వార్నింగ్ ఇస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments