Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియా ప్రకాష్‌కు సాయి పల్లవి వార్నింగ్... వళ్లు దగ్గర పెట్టుకుంటే.. (Video)

ప్రియా ప్రకాష్.. తన కను సైగలతో హావభావాలు పలికించి దేశాన్ని ఓ కుదుపు కుదిపిన కేరళ యువతి. ఈ కారణంగా ఆమె పేరు మార్మోగిపోతోంది. ముఖ్యంగా, కుర్రాళ్లంతా ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే చర్చించుకుంటున్నారు.

Advertiesment
Sai Pallavi
, బుధవారం, 7 మార్చి 2018 (13:14 IST)
ప్రియా ప్రకాష్.. తన కను సైగలతో హావభావాలు పలికించి దేశాన్ని ఓ కుదుపు కుదిపిన కేరళ యువతి. ఈ కారణంగా ఆమె పేరు మార్మోగిపోతోంది. ముఖ్యంగా, కుర్రాళ్లంతా ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే చర్చించుకుంటున్నారు. ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్‌తో ఆమె కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. 
 
పైగా, మలయాళ, తమిళ, తెలుగు నుంచేకాకుండా బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఏమాత్రం వెనుకాడటం లేదు. అలాంటి ప్రియా ప్రకాశ్‌కు "ఫిదా" భామ సాయి పల్లవి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వళ్లు దగ్గర పెట్టుకుని వుంటే మంచిదంటూ హెచ్చరించింది. 
 
ఇంతకీ ఆమె ఇలా వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం లేకపోలేదు. ప్రియా ప్రకాష్ తొలి మూవీ రిలీజ్ కాకముందే వరుస ఛాన్సులు వస్తున్నాయి. దీంతో ప్రియా ప్రకాష్ మరింత జాగ్రత్తగా వుండాలని సాయి పల్లవి సూచన చేస్తోంది. స్టార్ డమ్ సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలాకష్టమని తేల్చి చెప్పింది. 
 
ఇక మీదట మరింత శ్రద్ధతో ఆలోచించి సినిమాలకి సైన్ చేయాలనీ, పారితోషికం గురించి కాకుండా కథలు, అందులోని పాత్రల గురించి ఆలోచించాలని సలహా ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే .. కెరియర్ పరంగా తనలాగే ముందుకెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని, అందువల్ల ఆచితూచి అడుగులు వేయాలంటూ హితవు పలికింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్... వీక్కీనయన్' అంటున్న హీరోయిన్ (Video)