Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ లవ్ పవన్‌... ఆయన కోసం ఏమైనా చేస్తా... : 'నచ్చావులే' హీరోయిన్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తాను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు 'నచ్చావులే' హీరోయిన్ మాధవీలత చెప్పుకొచ్చారు. పైగా, తాను జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (12:49 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తాను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు 'నచ్చావులే' హీరోయిన్ మాధవీలత చెప్పుకొచ్చారు. పైగా, తాను జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 'న‌చ్చావులే' చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అచ్ఛ తెలుగమ్మాయి మాధ‌వీల‌త‌. ఈ చిత్రం తర్వాత ఆమె పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తెరమరుగైంది. 
 
ఆ తర్వాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని హీరోయిన్ల‌కు ఎదుర‌య్యే లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా వెల్ల‌డించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తాజాగా ఈ భామ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. అవ‌కాశం ఇస్తే ప‌వ‌న్ స్థాపించిన 'జ‌న‌సేన' ద్వారా ప్ర‌జాసేవ చేయాల‌నుకుంటున్న‌ట్టు మాధ‌వి వెల్ల‌డించింది. 
 
'ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే నాకెంత ఇష్ట‌మో ప‌దేళ్ల నుంచీ చెబుతూనే ఉన్నా. ప‌వ‌న్‌లాగానే నాకూ ప్ర‌జా సేవ అంటే ఎంతో ఇష్టం. ఓ వ్య‌క్తిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ 'జ‌న‌సేన' స్థాపించిన‌ప్పుడు నేనెందుకు మ‌ద్ద‌తివ్వ‌కూడదు. ప‌వ‌న్ కోసం ఏమి చేసేందుకైనా నేను సిద్ధ‌మేన' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం