Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెత్తనం కోసమే జగన్-బాబు ఫైట్.. జగన్-పవన్‌ను కలిపే శక్తి నాకు లేదు... ఉండవల్లి

ఉండవల్లి అరుణ్ కుమార్ అనగానే పదునైన విమర్శల దాడి చేసే నాయకుడని అందరూ చెపుతుంటారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు ఏర్పడిన కమిటీలో ఆయన కూడా పాలుపంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పలుసార్లు భేటీ అయ్యారు కూడా. పవన్ కళ్యాణ్ ఒక్కసారి

Advertiesment
పెత్తనం కోసమే జగన్-బాబు ఫైట్.. జగన్-పవన్‌ను కలిపే శక్తి నాకు లేదు... ఉండవల్లి
, సోమవారం, 19 మార్చి 2018 (20:29 IST)
ఉండవల్లి అరుణ్ కుమార్ అనగానే పదునైన విమర్శల దాడి చేసే నాయకుడని అందరూ చెపుతుంటారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు ఏర్పడిన కమిటీలో ఆయన కూడా పాలుపంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పలుసార్లు భేటీ అయ్యారు కూడా. పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెదేపాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడంతో తెదేపా నాయకులు బిత్తరపోతున్న సంగతి తెలిసిందే.
 
ఈ నేపధ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌ తాజాగా ఓ ప్రైవేట్ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ఆ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వైసీపీ అధినేత జగన్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కలిపేందుకు మీరు ప్రయత్నిస్తున్నారటగా అన్న ప్రశ్నకు స్పందిస్తూ... తనకు అంతటి సమర్థత లేదన్నారు. ఐతే ప్రస్తుత రాజకీయాలన్నీ ఓ వ్యాపారమంటూ ఓ లాజిక్ చెప్పుకొచ్చారు.
 
ఈ ఏడాది బడ్జెట్లో ఎనభై లేదా తొంభై కోట్లు జీతాలకు పోతాయనీ, అవి పోగా లక్షా పదివేల కోట్లు మిగులుతాయని చెప్పుకొచ్చారు. వాటి కోసమే అధికార, ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుంటున్నాయంటూ వెల్లడించారు. మిగిలిన డబ్బును కాంట్రాక్టర్లు రూపాయి భాగాన్ని అధికార పార్టీకి ఇస్తే, అర్థ రూపాయి భాగాన్ని ప్రతిపక్షానికి ఇస్తుందంటూ అసలు విషయాన్ని చెప్పేశారు. మరి ఇలా పంచుకున్న డబ్బు కూడా ప్రజలకు ఖర్చు పెట్టరట... వచ్చే 2019 ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుంటారని కూడా వెల్లడించారు. దీన్నిబట్టి గతంలో కూడా ఇదే ఫార్ములా నడిచిందని అనుకోవచ్చా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔను.. నేనంటే ప్రధాని మోడీకి ఇష్టం... బాబును అందుకే దూరం పెట్టారు: విజయసాయిరెడ్డి